ఉత్తరాఖండ్‌ రాష్ట్రం డెహ్రడూన్‌ సమీపంలోని జఖాన్ నది వద్ద ఉన్న డెహ్రాడూన్-రిషికేష్ వంతెన శుక్రవారం నీటి ప్రవాహం ధాటికి ఒక్క సారిగా కుప్పకూలింది.  ప్రస్తుతం బ్రిడ్జి కూలిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియా లో వైరల్‌ అవుతోంది. 

ఉత్తరాఖండ్‌‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో డెహ్రడూన్‌ సమీపంలోని జఖాన్ నది వద్ద ఉన్న డెహ్రాడూన్-రిషికేష్ వంతెన శుక్రవారం నీటి ప్రవాహం ధాటికి ఒక్క సారిగా కుప్పకూలింది. బ్రిడ్జి కూలిన సమయంలో దాని మీదుగా వెళ్తున్న వాహనాలు నదిలో పడిపోయాయి. కొన్ని వాహనాలు ఆ నీటి ప్రవాహానికి కొట్టుకు పోయాయి. అయితే, వాహనల్లోని జనం.. ప్రమాదాన్ని గ్రహించి వంతెనపైకి చేరుకోవడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రస్తుతం బ్రిడ్జి కూలిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియా లో వైరల్‌ అవుతోంది.