ముస్లిం సమాజంలోని ఎన్నో మూస పద్దతులను వ్యతిరేకిస్తూ మహిళల సాధికరతక కోసం పోరాడుతున్ననని ఖాజీ నిషాత్ హుస్సేన్ పేర్కొన్నారు. తను మహిళ హక్కుల కోసం ఉద్యమించినప్పుడూ.. ఎన్నో అవరోధలు ఎదురయ్యాయనీ, ప్రధానంగా పురుష సమాజం నుంచి అనే అవమానాలు ఎదురయ్యాయనీ, తన కొంతమంది తోటి న్యాయ నిపుణుల (ఖాజీ) నుండి అనేక సందేహాలు,ఎదురుదెబ్బలు ఎదుర్కొవల్సి వచ్చిందని పేర్కొన్నారు.
మూస పద్ధతులను ధిక్కరిస్తూ .. ముస్లిం సమాజంలో మార్పు, సాధికారతకు మార్గదర్శికగా నిలుస్తోంది ఖాజీ నిషాత్ హుస్సేన్. జైపూర్‌కు చెందిన నిషాత్ హుస్సేన్ రాజస్థాన్‌లో మొదటి మహిళా ఖాజీ (ఇస్లామిక్ న్యాయనిపుణుడు). ఆమె ఎన్నో అవమానాలను, ఆవరోధనాలను అధిరోహించి పలువురికి స్ఫూర్తిదాయకంగా మారింది. నిషాత్ ప్రయాణం ఎన్నో సవాళ్లు, విజయాలు ఇమిడి ఉన్నాయి.
ఆవాజ్ -ది వాయిస్‌తో ఆమె మాట్లాడుతూ.. ముస్లిం సమాజంలోని మూస పద్దతులను వ్యతిరేకిస్తూ.. మహిళల సాధికరతక, వారి హక్కుల కోసం ఉద్యమించినప్పుడూ.. ఎన్నో అవరోధలు ఎదురయ్యాయనీ, ప్రధానంగా పురుష సమాజం నుంచి అనే అవమానాలు ఎదురయ్యాయనీ, అలాగే..కొంతమంది తోటి న్యాయ నిపుణుల (ఖాజీ) నుండి అనేక సందేహాలు,ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నట్లు చెప్పారు.
తనను కించపరుస్తూ.. తన సామర్థ్యాలను తక్కువ అంచనా వేసి అవమానాలకు గురి చేశారని వాపోయారు. కానీ, వారి ఊహాలకు ఏమాత్రం అందకుండా.. తన పనిని తాను చేసుకుంటూ వెళ్లిపోయానని అన్నారు. ఆమె ఇటీవల సిమ్లాలో జరిగిన నికాహ్ అనే కార్యక్రమానికి అధ్యక్షత వహించాలని తనకు ఆహ్వనం అందించారని చెప్పుకొచ్చారు. ప్రభావవంతమైన ముస్లిం మహిళల గొంతుక (వాయిస్)గా ఖాజీ నిషాత్ హుస్సేన్ కీర్తి చాలా వరకు వ్యాపించింది.
ఇంటర్వ్యూ :
మహిళ ఖాజీ కావాలనే భావన భారతదేశంలో చాలా కొత్తది. మీరు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా నిలబడి.. మూస పద్ధతులను సవాలు చేయడం అంత సులభం కాదు. మీ ప్రయాణం , సవాళ్ల గురించి మాకు చెప్పండి?
నా మార్గం చాలా కష్టతరమైంది. ఈ మార్గంలో ఎన్నో సవాళ్లు కూడా ఉంటాయి. విమర్శకులు ఎన్నో సార్లు నన్ను లింగ ప్రతిపాదికన సామర్ధ్యాలను లెక్కకడుతూ అవమానించారు. ఒక మహిళ ఖాజీ కావడం తగదన్నారు. నా సామర్థ్యంపై వారు సందేహాలు వ్యక్తం చేశారు. నేను ఎన్నో కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నప్పటికీ నన్ను చాలా సున్నితంగా తిరస్కరించారు. అయినప్పటికీ.. నేను ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. ఖురాన్ గ్రంధం నుంచి స్పూర్తి పొందాను. ఈ గ్రంధం ద్వారానే స్త్రీ పురుషుల మధ్య భేదం లేదని నేను గుర్తు చేసుకున్నానని అని సమాధానమిచ్చారు.
మీరు ఔత్సాహిక మహిళా ఖాజీలకు శిక్షణ ఇవ్వడంలో కూడా పాల్గొంటున్నారు. మీ అనుభవాలను పంచుకోగలరా?
ఖాజీ పాత్ర కేవలం నికాహ్ వేడుకలను నిర్వహించడం కంటే చాలా ఎక్కువ. పురాతన కాలంలో ఖాజీ ప్రభావం ఎంతగా ఉందో.. రాజులు కూడా వారి తీర్పులను కోరేవారు. ఖాజీల విస్తృత, ముఖ్యమైన బాధ్యతలను నొక్కి చెబుతుంది. ఈ పాత్ర లోతును, చక్కటి జ్ఞానం యొక్క ఆవశ్యకతను గుర్తించి.. అమ్మాయిలను ఖాజీలుగా తీర్చిదిద్దే బాధ్యతను నేను తీసుకున్నాను.
వివాహాలు నిర్వహించే పరిధికి మించి, ఔత్సాహిక ఖాజీలు సమాజంలోని వివిధ అంశాలలో బాగా ప్రావీణ్యం కలిగి ఉండాలని నేను నమ్ముతున్నాను. సామాజిక నిబంధనలను అర్థం చేసుకోవడం, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల గురించి తెలుసుకోవడం. వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేసే ఇతర రంగాలపై అంతర్దృష్టితో చూడటం వంటివి ఇందులో ఉన్నాయి.
ట్రిపుల్ తలాక్ సమస్యను పరిష్కరించడానికి మీరు చేసిన ప్రయత్నాలను మీ అనుభవాలను పంచుకోగలరా?
ట్రిపుల్ తలాక్‌ను పరిష్కరించడానికి మేము "భారతీ ముస్లిం మహిళా ఆందోళన్" (సంస్థ)ని ఏర్పాటు చేసాము. మా పని రాజస్థాన్‌కే పరిమితం కాదు. దాని ప్రభావాన్ని 12 రాష్ట్రాల్లో పడింది.. ముస్లిం పర్సనల్ లా బోర్డులా కాకుండా.. మేము నేరుగా కమ్యూనిటీలతో భాగస్వామ్యమయ్యాం. ముంబైలో మహిళలు పెద్ద ఎత్తున ఏకమయ్యారు. తక్షణ తలాక్ కారణంగా తమ పిల్లలు పడుతున్న బాధలను తమతో కథలు కథలుగా పంచుకున్నారు. సుప్రీం కోర్టుకు మా అభ్యర్థనను స్వీకరించి, తక్షణ తలాక్‌పై నిషేధాన్ని సాధించామని తెలిపారు. ఇది మహిళల ఐక్యతకు నిదర్శం. అయినప్పటికీ.. ట్రిపుల్ తలాక్ యొక్క పరిణామాలను ఎదుర్కొంటున్న మహిళలను రక్షించడానికి సమగ్ర చట్టం కోసం వాదిస్తూ.. చట్టం ద్వారా శాశ్వత మార్పు తీసుకరావాలని పెట్టుకున్నామని తెలిపారు.
బహుభార్యత్వం, హలాలా సమస్యలను ఎలా అరికట్టారో తెలపండి?
బహుభార్యత్వం.. పురుషులు దీనిని తమకు ఇస్లాం అందించిన హక్కుగా భావిస్తారు. మళ్లీ పెళ్లి చేసుకునే ముందు.. తమ భార్య అనుమతి కోరే నైతిక బాధ్యతను కూడా వారు తరచు విస్మరిస్తారు. ఇక్కడ మరో విచారకరం విషయమేటింటంటే.. ఇలాంటి వివాహాల సందర్భంలో మొదటి భార్య,పిల్లలను నిర్లక్ష్యంగా విడిచిపెట్టడం చూడవచ్చు. ఈ విషయాన్ని తాము ఎన్నో సార్లు గమనించామని చెప్పుకొచ్చారు.
అలాగే.. హలాలా కేసులను అధ్యయనం చేస్తున్నప్పుడు..మేము కలతపెట్టే కథలను చూశాము. ఒక సందర్భంలో.. ఒక వ్యక్తి జూదంలో ఓడిపోయింది. దీంతో అతడు తన భర్త ఆమెను ఒక రాత్రికి స్నేహితుడికి అమ్మేశాడు. ఈ కథలు దోపిడీ పద్ధతుల నుండి తలెత్తే నిరాశ లోతులను ఉదాహరణగా చూపుతాయి. మేము జోక్యం చేసుకుని వారి నుంచి ఆ బాధిత మహిళను విడిపించామని తెలిపారు. అటువంటి పరిస్థితులలో తరచుగా ఎదురయ్యే నిందలను పరిష్కరించడానికి మమ్మల్ని ప్రేరేపించింది.
మత సామరస్యానికి సంబంధించి మీ అనుభవాలను పంచుకోగలరా?
1980 నాటి నేను మహిళ సాధికరత కోసం ఉద్యమిస్తున్నా.. ఈ తరుణంలో ఎన్నో తిరుగుబాటును చూశాను.ఈ తరుణంలో స్త్రీల బాధలను ప్రత్యక్షంగా చూశాను. ప్రతి హింసా చర్య వల్లే వచ్చే తీవ్ర పరిణామాలను గ్రహించాను. ఇది కేవలం ఒక జీవితాన్ని మాత్రమే ప్రభావితం చేయదు. ఇది మొత్తం కుటుంబాన్ని (కొడుకులు, కుమార్తెలు, భర్తలు, సోదరులు) ప్రభావితం చేస్తుంది. మత సామరస్యం ప్రాముఖ్యతను మరింత లోతుగా అర్థం చేసుకునే లక్ష్యంతో అట్టడుగు స్థాయిలో అవిశ్రాంతంగా పనిచేస్తున్నా.. ఈ మేరకు ఎన్నో అవగాహన కార్యక్రమాలను చేశానని తెలిపారు.
ముస్లిం వారసత్వ చట్టాల ప్రకారం ముస్లిం బాలికలకు ఆస్తిలో న్యాయమైన వాటా లభించదు కాదా. మీ అభిప్రాయం ఏమిటి?
ఖురాన్ 1500 సంవత్సరాల క్రితం వారసత్వ చట్టాలను నిర్దేశించింది, అయితే కేవలం కొద్దిమంది మాత్రమే తమ నిజమైన ఆస్తి వాటాను సురక్షితంగా ఉంచుకున్నారు. తల్లిదండ్రుల మరణం తర్వాత.. సోదరులు తరచుగా తమ సోదరీమణుల వాటాను నిలిపివేయడం నిరుత్సాహపరుస్తుంది. ఈ సందర్భంలో.. మహిళలకు తమ హక్కులను నొక్కిచెప్పడం. వారసత్వంలో తమ హక్కుల కోసం వారి గళం విప్పడం అత్యవసరమని తెలిపారు.
మీ మార్గంలో నిస్సందేహంగా ఎన్నో ప్రశంసలు, విమర్శలుంటాయి. వాటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు?
నా పోరాటంలో ఎన్నో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాను. అయినా వాటికి సగ్వరంగా ఆహ్వానిస్తాను. నేను ఎదుర్కొన్న ఎదురుదెబ్బలు మరింతంగా రాణించాలనే నా సంకల్పానికి ఆజ్యం పోశాయి. నా ప్రయాణంలో ఎదురైన ప్రతి సమస్యను ఓ సవాలుగా స్వీకరించాను. నా ప్రయత్నాలను అణగదొక్కాలని ప్రయత్నించే పితృస్వామ్య నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యమించాను. ఈ క్రమంలో నా నిబద్ధతను గుర్తించి..ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకున్న సందర్బాలు ఎన్నో ఉన్నాయి. అన్నింటి కంటే.. ప్రజల అభ్యున్నతి కోసం పాటు పడటమే నా ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.
ఇంటర్వ్యూ చేసిన వారు- యాస్మీన్ ఖాన్, న్యూఢిల్లీ.
