Asianet News TeluguAsianet News Telugu

రోహిణి సింధూరిపై పరువునష్టం దావా.. ఎంతకు వేశారో తెలిస్తే షాక్...

మైసూరు జిల్లా అధికారిగా వ్యవహరించిన రోహిణి సింధూరిపై అదే జిల్లాకు చెందిన జెడిఎస్ పార్టీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సారా మహేష్ వంద రూపాయలకు పరువు నష్టం దావా వేశారు.

defamation case filed on rohini sindhuri - bsb
Author
Hyderabad, First Published Jun 24, 2021, 2:26 PM IST

మైసూరు జిల్లా అధికారిగా వ్యవహరించిన రోహిణి సింధూరిపై అదే జిల్లాకు చెందిన జెడిఎస్ పార్టీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సారా మహేష్ వంద రూపాయలకు పరువు నష్టం దావా వేశారు.

మైసూర్ అధికారిగా రోహిణి సింధూరి పనిచేసిన ఎనిమిదేళ్లపాటు ఇరువురి మధ్య పలు అంశాలపై వివాదాలు కొనసాగాయి. ఈ ఘటనతో ప్రస్తుతం ఈ వివాదం కోర్టుల దాకా చేరినట్లు అయింది .

చామరాజనగర్ జిల్లా ఆస్పత్రిలో కోవిడ్ బాధితులు ఆక్సిజన్ అందక 20 మంది మృతి చెందడానికి రోహిణి సింధూరి కారణమని సారా మహేష్ అప్పట్లో ఆరోపించారు.  చామరాజనగర్ కు మైసూర్ నుంచే ఆక్సిజన్ చేరవేయాల్సి  ఉండగా జాప్యం చేశారని ఆయన ఆరోపించారు.

వివాదంపై హైకోర్టు నియమించిన ఇరువురు రిటైర్డ్ న్యాయమూర్తుల విచారణలో మైసూరు జిల్లా అధికారి రోహిణి సింధూరి కి సంబంధం లేదని తేల్చారు. ఇందుకు జిల్లా ప్రజలకు, అధికారులకు సారా మహేష్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆ తర్వాత సారా మహేష్ కు చెందిన కళ్యాణమండపం రాజకాలువపై ఉందని జిల్లా అధికారి ఆరోపించారు. రెవెన్యూ శాఖ పరిశీలనలో అక్రమాలు చోటు చేసుకోలేదని తేలింది దీనికితోడు పదేళ్లుగా మహేష్ తో పాటు ఆయన భార్య కు చెందిన ఆస్తులను విచారించాలని రోహిణి సింధూరి మైసూరు అభివృద్ధి ప్రాధికార కు లేఖ రాశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios