న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి భద్రతా మండిలిలో ఇండియాను  శాశ్వత సభ్యదేశంగా ఎన్నుకొన్నందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు.

ఐక్యరాజ్యసమితిలో 193 మంది సభ్యుల సమావేశంలో ఇండియా 184 ఓట్లు సాధించింది. యూఎన్ఓ భద్రతా మండలిలో ఇండియాకు సభ్యత్వం కోసం ప్రపంచ సమాజం చూపిన అధిక మద్దతుకు ఆయన ధన్యవాదాలు చెప్పారు.

 

ప్రపంచశాంతిని ప్రోత్సహించేందుకు ఇతర దేశాలతో కలిసి తాము పనిచేస్తామని మోడీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.ఇండియా, మెక్సికో, ఐర్లాండ్ , నార్వే దేశాలు ఐక్యరాజ్యసమతి భద్రతా మండలికి ఎన్నికయ్యాయి. రెండేళ్ల పాటు ఇండియా ఈ స్థానంలో కొనసాగనుంది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో  ఐదు దేశాలకు వీటో పవర్ ఉంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యాలు. వీటితో పాటు మరో పది దేశాలు శాశ్వత సభ్యులుగా ఉంటారు.ఏదైనా దేశంపై బల ప్రయోగం చేయడానికి చట్టబద్దంగా నిర్ణయాలు తీసుకొనే అధికారం భద్రతా మండలి కల్పిస్తోంది.

2021-22 ఏడాదికి గాను యూఎన్ఓ భద్రతా మండలి శాశ్వత స్థానానికి అత్యధిక మద్దతుతో ఇండియా ఎన్నికైందని ఐక్యరాజ్యసమితి ట్వీట్ చేసింది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుండి సెక్యూరిటీ కౌన్సిల్ లో ఇండియా కూర్చొంటుంది.

సెక్యూరిటీ కౌన్సిల్ లో సభ్యత్వం పొందాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ ఓట్లు అవసరం. ఆసియా-ఫసిఫిక్ కేటగిరి నుండి ఇండియా మాత్రమే కౌన్సిల్ కు ఎన్నికైంది. 

భారత్ 1950-51, 1967- 1968, 1972-1973, 1977-1978,1984-1985,1991-1992లలో భారత్ నాన్ పర్మినెంట్ సభ్య దేశంగా ఎన్నికైంది, 2011-20112లో శాశ్వత సభ్యునిగా కొనసాగింది.