Asianet News TeluguAsianet News Telugu

రోడ్డుపై బురద నీటిలో మహిళా ఎమ్మెల్యే స్నానం.. వైరల్ వీడియో.. ఎందుకంటే..?

Viral video: ఒక మ‌హిళా ఎమ్మెల్యే న‌డిరోడ్డుపై బుర‌ద నీటిలో స్నానం చేశారు. అక్క‌డి రోడ్ల దుస్థితిని వివ‌రిస్తూ.. వినూత్నంగా నిర‌స‌న తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. 
 

Deepika Pandey Singh: Woman MLA bathes in muddy water on the road Because..?  Viral video
Author
First Published Sep 21, 2022, 4:59 PM IST

Woman MLA bathes in muddy water: ఒక మ‌హిళా ఎమ్మెల్యే న‌డిరోడ్డుపై బుర‌ద నీటిలో స్నానం చేశారు. అక్క‌డి రోడ్ల దుస్థితిని వివ‌రిస్తూ.. వినూత్నంగా నిర‌స‌న తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది.  వివ‌రాల్లోకెళ్తే..  జాతీయ రహదారి అధ్వాన్నంగా మారడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే రోడ్డుపైనే బురద నీటిలో స్నానం చేసి నిరసన తెలిపారు. జాతీయ రహదారి 133 అధ్వాన్నంగా ఉందని జార్ఖండ్ ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్ బురద నీటిలో స్నానం చేశారు. వర్షం కారణంగా జాతీయ రహదారిపై భారీగా నీరు నిలిచింది. దీంతో అక్క‌డ రాక‌పోక‌లకు తీవ్ర ఇబ్బందులు ఎద‌ర‌వుతున్నాయి. బుర‌ద నీరు భారీగా నిలిచిపోవ‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె రోడ్ల‌ను బాగుచేయాల‌ని కోరుతూ ఇలా బుర‌ద నీటిలో స్నానం చేసి నిర‌స‌న తెలిపారు.

చాలా కాలంగా రోడ్డు పరిస్థితి దయనీయంగా ఉంది. దీనికి కొనసాగింపుగానే ప్రమాదాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే చెబుతున్నారు. ఈ విషయమై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదు. మరమ్మతులు ప్రారంభించే వరకు ఇక్కడే ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో పలుమార్లు మరమ్మతులు చేసినా రోడ్డు నష్టం తగ్గలేదు. ఈ విషయంలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు.

క‌ర్నాట‌క‌లోనూ.. 

కర్నాటకకు చెందిన ఒక సామాజిక కార్యకర్త ఉడిపిలో గుంతలమయమైన రోడ్లపై ప‌రిస్థితిని వివ‌రిస్తూ వినూత్న‌ రీతిలో నిర‌స‌న తెలిపారు. ఆయ‌న గుంత‌ల‌మ‌య‌మైన రోడ్డుపై దొర్లుతూ నిర‌స‌న తెలిపారు. కొంద‌రు భ‌క్తులు దేవునికి మొక్కులు చెల్లించుకోవ‌డానికి గుడిలో నెల‌పై దొర్లుతుంటారు. ఈ త‌ర‌హానే బుధవారం  రోడ్డుపై ఉన్న బురద గుంతలకు కొబ్బరికాయ పగులగొట్టి హారతి నిర్వహించి నిరసన ప్రారంభించారు. అనంతరం నిత్యానంద ఒల‌క‌డు మీడియాతో మాట్లాడుతూ ఉడిపి-మణిపాల్‌ జాతీయ రహదారిపై మూడేళ్ల క్రితం టెండర్లు కేటాయించినప్పటికీ రోడ్డు ఇంకా అధ్వానంగా ఉందన్నారు. “ఎవరూ ఏ సమస్యను లేవనెత్తడం లేదు. ప్రతిరోజు వేలాది మంది ఈ రహదారిని ఉపయోగిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ఈ మార్గం గుండా వెళ్లారని, రోడ్డు మరమ్మతుల కోసం ప్రధాని నరేంద్ర మోడీ గానీ, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ గానీ ఇక్కడికి రావాలన్నారు. 

ఈ సంఘటనపై అధికారులు ఇంకా స్పందించనప్పటికీ, కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్ అశోక ఇటీవల మాట్లాడుతూ, "అక్రమ ఆక్రమణలను తొలగించడానికి ప్రభుత్వం నోయిడా ట్విన్ టవర్స్ లాంటి కూల్చివేత డ్రైవ్‌ను ప్రారంభిస్తుందని, గత వారం వర్షం తర్వాత బెంగళూరు నష్టాలను లెక్కించిందని తెలిపారు. కాగా, ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌తో బెంగళూరులోని పెద్ద ప్రాంతాలు జలమయం కావడంతో, రోడ్లు, ఇళ్లు, కార్యాలయాలు నీట‌మునిగాయి. ఈ క్ర‌మంలోనే భారీ వ‌ర్షాలు అంటే బెంగ‌ళూరు న‌గ‌ర‌వాసులు భ‌య‌ప‌డిపోతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios