ముంబై:కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఎప్పటికైనా ప్రధానమంత్రి అవుతారని బాలీవుడ్ హీరోయిణ్ దీపిక పడుకొనె అభిప్రాయపడ్డారు.

దీపిక పడుకొనే రాహుల్ గాంధీ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారాయి.ఓ జాతీయ మీడియా ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలపై తన అభిప్రాయాలను కుండబద్దలుకొట్టారు. 

భవిష్యత్తులో రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అయ్యే అవకాశం ఉందని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు ఇష్టమైన నేత రాహుల్ గాంధీ అని ఆమె చెప్పారు. అసలైన దేశభక్తి తనకు రాహుల్ గాంధీలో కన్పిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నారు.

రాహుల్ మంచి నాయకుడు అని ఆమె అభిప్రాయపడ్డారు. మంచి నాయకుడికి ఆయనే సరైన ఉదహరణన్నారు. డ్రగ్స్ కేసులో దీపిక పడుకొనె రెండు రోజుల క్రితం ఎన్‌సీబీ అధికారుల ముందు హాజరయ్యారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి సంబంధించిన అంశాలతో పాటు ఇతర కీలక అంశాలపై కూడ ఆమె ఈ ఇంటర్వ్యూలో చెప్పారు.