Asianet News TeluguAsianet News Telugu

మైనర్ కూతురిపై అఘాయిత్యం, పెళ్లైనా వదలని కీచకతండ్రి.. మరణశిక్ష విధించిన కోర్టు...

మైనర్ కుమార్తెకు పెళ్లి చేశాక కూడా, ఆమెను ఇంటికి తీసుకువచ్చి అత్యాచారం చేశాడని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. 14యేళ్ల బాధిత బాలిక మీద సాక్షాత్తూ తండ్రి అత్యాచారం చేస్తుండగా బాలిక భర్త పట్టుకుని కేసు పెట్టాడు. గత రెండేళ్లుగా తండ్రి అత్యాచారం చేస్తున్నా బెదిరించడంతో బాధితురాలు మౌనంగా ఉన్నట్లు కోర్టుకు తెలిపింది. 

Death Sentence to the father who abused his daughter in uttarpradesh
Author
Hyderabad, First Published Nov 24, 2021, 10:35 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రైచ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తన Minor daughter మీద అత్యాచారం చేసిన 40 యేళ్ల కీచక తండ్రికి మరణశిక్ష విధిస్తూ 
Bahraich Court తీర్పు చెప్పింది. సంఘటన జరిగిన తరువాత మూడు నెలల లోపు తండ్రిని దోషిగా నిర్ధారించిన కోర్టు అదనపు సెషన్స్ జడ్జి నితిన్ కుమార్ పాండే శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారని ప్రత్యేక జిల్లా ప్రభుత్వ న్యాయవాది సంత్ ప్రతాప్ సింగ్ చెప్పారు. 

మైనర్ కుమార్తెకు పెళ్లి చేశాక కూడా, ఆమెను ఇంటికి తీసుకువచ్చి అత్యాచారం చేశాడని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. 14యేళ్ల బాధిత బాలిక మీద సాక్షాత్తూ తండ్రి అత్యాచారం చేస్తుండగా బాలిక భర్త పట్టుకుని కేసు పెట్టాడు. గత రెండేళ్లుగా తండ్రి అత్యాచారం చేస్తున్నా బెదిరించడంతో బాధితురాలు మౌనంగా ఉన్నట్లు కోర్టుకు తెలిపింది. 

Victimపాటు ఆమె కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టంలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. దోషికి Death sentenceతో పాటు 51వేల రూపాయల జరిమానా కూడా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. జులైలో తెలంగాణలో ఇలాంటి అమానుష ఘటనే చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన  ఓ వ్యక్తి కూతురిపై Rape చేశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం యేడాది క్రితం హైదరాబాద్ కు వలస వచ్చారు. ఇక్కడ ఓ అపార్ట్మెంట్ లో భర్త వాచ్ మెన్ గా, భార్య ఇంట్లో పనులు చేస్తు జీవిస్తున్నారు. వీరికి 16 ఏళ్ల కూతురు, 14 ఏళ్ల కుమారుడు ఉన్నారు. స్వగ్రామంలో ఉండగా చదువుకున్న కూతురు.. హైదరాబాద్ కు వచ్చాక చదువు ఆపేసి ఇంట్లోనే తల్లిదండ్రులతో ఉంటుంది.

‘ఓరల్ సెక్స్’ నేరమే.. కానీ అంత తీవ్రమైనది కాదు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

ఈ క్రమంలో తండ్రి కూతురి మీద కన్నేశాడు. ఇంట్లో ఎవ్వరూ లేనిది చూసి కూతురు తినే అన్నంలో sleeping pills కలిపి ఇచ్చేవాడు. ఆమె నిద్రలోకి జారుకున్నాక అత్యాచారం చేసేవాడు. తరచుగా ఇలాగే జరుగుతుండేది.. అయితే నిద్రమత్తులో ఉండడం వల్ల ఆమెకు జరిగిన విషయం తెలియకపోయేది. 

అయితే ఒకసారి తల్లి ఊరెళ్లింది. తండ్రి బాగా తాగి వచ్చాడు. ఇంట్లో భార్య లేకపోవడంతో కూతురి మీద నేరుగానే దాడికి దిగాడు. అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తరువాత ఈ విషయం తల్లికి చెబితే చంపేస్తానని బెదిరించాడు దాంతో బాలిక మౌనంగా ఉండిపోయింది. కాగా కొద్దిరోజుల తరువాత బాలిక అనారోగ్యానికి గురై వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. దాంతో ఆమెను తల్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లింది. 

అక్కడ ఆమెకు పరీక్షలు జరిపిన వైద్యులు బాలిక pregnant అయ్యిందని చెప్పారు. బాలికను ఇంటికి తీసుకు వచ్చి నిలదీయడంతో.. భోరున విలపిస్తూ జరిగిన ఘోరం చెప్పింది. బాలిక తల్లి బాలికను తీసుకుని వెళ్లి హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతలో బాలిక తండ్రి పరారయ్యాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios