గేదెకు దశదినకర్మ చేశాడో జంతు ప్రేమికుడు. తన ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న గేదె అనారోగ్యంతో మృతి చెందడంతో దానికి మనుషులకు చేసినట్టు అంత్యక్రియలు చేసి ఆ తరువాత దశదినఖర్మ కూడా చేసి తన ప్రేమను చాటుకున్నాడు. యూపీలోని మీరట్ లో జరిగిన ఈ ఘటనకు చెందిన ఒక వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో ఒక గేదెకు దశదిన కర్మలు చేస్తున్న దృశ్యం కనిపిస్తోంది. ఈ సందర్భంగా గ్రామస్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని చనిపోయిన గేదెకు నివాళులు అర్పించారు. ఈ ఉదంతం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
ఉత్తరప్రదేశ్ లోని మొహమ్మద్ షాకిస్త్ గ్రామానికి చెందిన సుభాష్ వ్యవసాయం చేస్తుంటాడు. గత 32 ఏళ్లుగా ఒక గేదెను కూడా సంరక్షిస్తున్నాడు. ఈ మధ్య కొంతకాలంగా ఆ గేదె పాలు ఇవ్వడం మానేసింది. సుభాష్‌కు ఆ గేదెతో ప్రత్యేక అనుబంధం ఉంది. అది అనారోగ్యం బారిన పడినప్పుడు ఎంతో ఖర్చు చేసి వైద్యం చేయించాడు. అయినప్పటికీ ఆ గేదెను కాపాడుకోలేకపోయాడు.
ఆ గేదె మృతి చెందడంతో సుభాష్ కుటుంబ సభ్యులంతా ఎంతో బాధపడ్డారు. ఆ గేదెకు శాస్త్రబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఆది మృతి చెందిన పదవ రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు గ్రామస్తులందరికీ అన్న సంతర్పణ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గేదె శ్రద్ధాంజలి సభకు గ్రామస్తులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ ఆ గేదె తమ ఇంటిలో సభ్యురాలిగా మెలిగిందని, దాని ఆత్మశాంతి కోసం సంప్రదాయబద్ధంగా కర్మకాండలు నిర్వహించామన్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 9, 2021, 10:44 AM IST