రద్దీగా రోడ్డు.. ఫ్లైఓవర్‌కు వేలాడుతున్న శవం.. ఉలిక్కిపడిన జనం

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 10, Aug 2018, 11:10 AM IST
dead body hanging in flyover at delhi
Highlights

నిత్యం రద్దీగా ఉండే ఫ్లైఓవర్‌కు శవం వేలాడుతూ కనిపించడంతో ఢిల్లీలో కలకలం రేపింది. ఉత్తర ఢిల్లీలోని అజాద్‌పూర్‌ సమీపంలోని దౌలాఖాన్‌ బ్రిడ్జిపై నిన్న ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, ప్రజలు ఉలిక్కిపడ్డారు

నిత్యం రద్దీగా ఉండే ఫ్లైఓవర్‌కు శవం వేలాడుతూ కనిపించడంతో ఢిల్లీలో కలకలం రేపింది. ఉత్తర ఢిల్లీలోని అజాద్‌పూర్‌ సమీపంలోని దౌలాఖాన్‌ బ్రిడ్జిపై నిన్న ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, ప్రజలు ఉలిక్కిపడ్డారు.

వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దించి.. మృతుడి జేబులో ఉన్న కార్డులు, ఇతరత్రా పేపర్లు పరిశీలించి అతడిని సమీపంలోని అజాద్‌పూర్‌ ఎంసీడీ కాలనీకి చెందిన 38 ఏళ్ల సత్యేంద్రగా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

మృతదేహం వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. దీంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అనే కోణంలో  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్లైఓవర్‌కు డెడ్ బాడీ వేలాడుతుందనే వార్త ఆ ప్రాంతంలో హాట్ టాపిక్‌గా మారింది. 

loader