Asianet News TeluguAsianet News Telugu

Mukesh Khanna: మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన శక్తిమాన్.. మండపడుతున్న నెటిజన్లు.

Mukesh Khanna: సోషల్ మీడియాలో  మహిళలపై శక్తిమాన్ నటుడు ముఖేష్ ఖన్నా చేసిన వ్యాఖ్యలు వివాదాస్ప‌దంగా మారాయి. ఆయ‌న‌ వ్యాఖ్య‌ల‌పై ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ స్పందిస్తూ.. అత‌నిపై కేసు న‌మోదు చేయాల‌ని ఢిల్లీ పోలీసుల‌ను కోరారు. 

DCW Swati Malliwal seeks FIR against Shaktimaan actor Mukesh Khanna
Author
Hyderabad, First Published Aug 11, 2022, 2:36 AM IST

Mukesh Khanna: సోషల్ మీడియాలో  మహిళలపై శక్తిమాన్ నటుడు ముఖేష్ ఖన్నా చేసిన వ్యాఖ్యలు వివాదాస్ప‌దంగా మారాయి. నెట్టింట్లో ఆయ‌న వ్యాఖ్యల‌పై తీవ్ర‌దుమారం రేగుతోంది. ప‌లువురు ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌డుతున్నారు. తాజాగా న‌టుడు ముఖేష్ ఖ‌న్నా వ్యాఖ్య‌ల‌పై ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ స్పందించారు. మహిళలపై అవమానకర‌, అస‌భ్యక‌ర వ్యాఖ్య‌లు చేసిన నటుడు ముఖేష్ ఖన్నాపై చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్‌కి నోటీసు జారీ చేశారు. ముఖేష్ ఖన్నాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 

ఈ క్ర‌మంలో ఆమె ట్విట్ చేస్తూ.. మహిళలపై బాలీవుడ్ నటుడు తప్పుడు వ్యాఖ్యలు చేశాడని మలివాల్ ఆరోపించారు. శక్తిమాన్ పాత్రలో నటించిన నటుడు ముఖేష్ ఖన్నా మహిళలపై చేసిన అభ్యంతరకర ప్రకటనలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినందుకు ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశామని మలివాల్ ట్వీట్ చేశారు. ఆ నోటీసులో ఆమె ముఖేష్ ఖన్నా వ్యాఖ్యలను ప్రస్తావించారు. 


అస‌లేం జ‌రిగిందంటే..?

బాలీవుడ్ న‌టుడు ముఖేష్ ఖన్నా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న నెటిజ‌న్ల‌తో పలు అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడిస్తూ..  వీడియోలు పోస్టు పెడుతుంటారు. తాజాగా ఆయ‌న పోస్టు ఓ వీడియో ర‌చ్చ‌కు కార‌ణ‌మైంది. ఆ వీడియోలో ఆయ‌న మాట్లాడుతూ.. మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. 

‘మీరు కూడా ఇలాంటి అమ్మాయిని ఇష్టపడుతున్నారా’ అనే టైటిల్ తో పోస్టు చేసిన వీడియోలో బాలీవుడ్ నటుడు మాట్లాడుతూ.. మీతో నేను సెక్స్ చేయాలనుకుంటున్నానని ఏ అమ్మాయి అయినా అబ్బాయితో చెబితే.. ఆ అమ్మాయి అమ్మాయి కాదు, వ్యాపారం చేస్తుందని, సెక్స్ వర్కర్లు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఏ నాగరిక సమాజపు అమ్మాయి ఇలాంటి సిగ్గులేని పనులు చేయదు, అలా చేస్తే తను నాగరిక సమాజానికి చెందినది కాదు, ఆ అమ్మాయి వ్య‌భిచార‌నీ, అలాంటి అమ్మాయిల‌కు చాలా దూరంగా ఉండాలని, అమాయ‌క పురుషుల‌ను టార్గెట్ చేస్తూ.. బ్లాక్ మెయిల్ చేస్తార‌ని నటుడు ముఖేష్ ఖన్నా మహిళలపై చేసిన అభ్యంతరకర ప్రకటన చేశారు. అలాగే.. తమతో సెక్స్ చేయాల‌ని తనకు సందేశాలు వచ్చాయంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్యలు చేశాడు. న‌టుడు ముఖేష్ ఖన్నా వ్యాఖ్యలపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌నో సెక్సిస్ట్ అంటూ  కామెంట్స్ చేస్తున్నారు.
 
ముఖేష్ ఖన్నా యొక్క మరొక వీడియో కూడా ఉంది. అందులో నటి, నసీరుద్దీన్ షా భార్య రత్న పాఠక్ షా ప్రకటనను ఖండించాడు. కర్వా చౌత్‌ పాటించే మహిళలు నిరక్షరాస్యులని రత్న అన్నారని అన్నారు. మీరు ఎక్కువగా ఏమి చదివారని మీరు అనుకుంటున్నారు? అతి పెద్ద ఇళ్లలోని మహిళలు కూడా కర్వా చౌత్‌ను ఆచరిస్తారు. వారు సంతోషంగా ఉన్నారు, ఇది చాలా అందమైన పండుగ, మీరు దీనిని మూఢనమ్మకం అంటారు.

మూఢనమ్మకంలో కూడా ఒక స్త్రీ తన భర్త కోసం, తన భర్త దీర్ఘాయుష్షు కోసం ఒక రోజు ఉపవాసం ఆచరిస్తే, అది ఎంత మంచి విషయం. హిందూ మతాన్ని ఎందుకు టార్గెట్ చేస్తారని అంటున్నారు. మనం కూడా మూఢనమ్మకాలలో బతుకుతున్నామంటే.. మనం బాగా జీవిస్తున్నాం. మన మతం విశ్వాసం మీద నడుస్తుంది. మేము ప్రశ్నలు అడగము. మీ ఈ బాధ్యతారహిత ప్రకటన నాకు నచ్చలేదు. ధైర్యం ఉంటే ఓ గ్రామానికి వెళ్లి ఈ మాట చెబితే అక్కడి మహిళలు పరుగులు తీస్తారని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios