కరోనా ఉందనే అనుమానంతో ఇటీవల ఓ బాలికను బస్సులో నుంచి తోసేశారు. కాగా... ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే... ఢిల్లీలోని మాండవాలి ప్రాంతానికి చెందిన 19ఏళ్ల బాలిక ఇటీవల మహారాష్ట్ర్ర నుంచి ఉత్తరప్రదేశ్ కి బస్సులో ప్రయాణిస్తోంది.

బాలికతో పాటు ఆమె కుటుంబసభ్యులు కూడా అదే బస్సులో ప్రయాణిస్తున్నారు. కాగా.. బాలికకు కరోనా ఉందనే అనుమానంతో ఆ బస్సు కండక్టర్.. దారుణంగా ప్రవర్తించాడు. బాలికను కదిలే బస్సులో నుంచి బలవంతంగా కిందకు తోసేశాడు. కాగా.. తలకు తీవ్ర గాయమై.. బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.

కాగా.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీనిపై ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ గా స్పందించింది. ఢిల్లీ మహిళా కమిషన్ స్వయంగా ఈ కేసును సుమోటోగా తీసుకుంది. కాగా... ఈ ఘటనపై పోలీసులకు కనీసం ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ పేర్కొన్నారు. అంతేకాకుంకుడా.. నిందితులను అదుపులోకి తీసుకోలేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో.. యూపీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు.