కరోనా వ్యాక్సిన్‌లు అయిన కొవాగ్జిన్, కోవిషీల్డ్ మిక్సింగ్ కోసం 300 మంది ఆరోగ్య వంతులైన వాలంటీర్లపై ఫేజ్ 4 క్లినికల్ ట్రయల్ నిర్వహించేందుకు వెల్లూరు మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. ఈ క్రమంలో డీసీజీఐ వ్యాక్సిన్ మిక్సింగ్‌కు అనుమతిని ఇచ్చింది 

భారత్‌లో కొవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్‌పై అధ్యయనానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. తమిళనాడులోని వెల్లూరు మెడికల్ కాలేజ్ ఈ ట్రయల్స్ నిర్వహించనుంది. వ్యాక్సినేషన్ కోర్సును పూర్తి చేయడానికి ఒక వ్యక్తికి రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులు ఇవ్వగలమా లేదా అన్నదానిపై ఈ అధ్యయనంలో అంచనా వేస్తారు. జూలై 29న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కి చెందిన నిపుణుల కమిటీ ఈ అధ్యయనానికి సిఫారసు చేసింది.

కరోనా వ్యాక్సిన్‌లు అయిన కొవాగ్జిన్, కోవిషీల్డ్ మిక్సింగ్ కోసం 300 మంది ఆరోగ్య వంతులైన వాలంటీర్లపై ఫేజ్ 4 క్లినికల్ ట్రయల్ నిర్వహించేందుకు వెల్లూరు మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. ఈ క్రమంలో డీసీజీఐ వ్యాక్సిన్ మిక్సింగ్‌కు అనుమతిని ఇచ్చింది. ఇప్పటికే రెండు వ్యాక్సిన్లు మిక్స్ చేయడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నట్లుగా నివేదికలు వస్తున్న నేపథ్యంలో దీనిపై మరింత లోతైన అధ్యయనం ప్రారంభం కానుంది.