కుప్వారాలో జరిగిన ఎన్కౌంటర్లో భారతీయ స్పెషల్ ఫోర్సెస్ కి చెందిన ఐదుగురు  సైనికులుమరణించిన 5 రోజుల్లోనే అదే సెక్టార్ లో భారతీయ బలగాలు పాకిస్తాన్ పై విరుచుకుపడ్డాయి. పాకిస్తాన్ ఆయుధాల డంప్ ను, టెర్రర్ లాంచ్ ప్యాడ్లను పూర్తిగా ధ్వంసం చేసాయి. ఇందుకు సంబంధించి డ్రోన్ వీడియోలను విడుదల చేసాయి. 

పాకిస్తాన్ ఆర్మీ డంప్ ను భారత బోఫోర్స్ ఫిరంగులు గుల్ల వర్షం కురిపిస్తూ ధ్వంసం చేసాయి. ఆ డంప్ తో పాటుగా భారత్ లోకి ఉగ్రవాదులను పంపించేందుకు సిద్ధం చేసే టెర్రర్ ళుంక్ ప్యాడ్లను కూడా ధ్వంసం చేసాయి. భారత ఆర్మీ రిలీజ్ చేసిన ఈ వీడియోలో ఒకదానితరువాత ఒకటి డంప్, లాంచ్ పాడ్స్ పేలడం మనం చూడవచ్చు. 

భారత బోఫోర్స్ ఫిరంగులు పూర్తి ఖచ్చితత్వంతో నేరుగా వాటినే టార్గెట్ చేస్తూ బాంబులు సంధిస్తుంటే, పై నుంచి డ్రోన్ ద్వారా వీటిని షూట్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఒకదానితరువాత ఒకటిగా వరుస పేలుళ్లను మనం ఈ వీడియోలో చూడవచ్చు. 

ఆదివారం రోజున భారత స్పెషల్ ఫోర్సెస్ కి చెందిన ఐదుగురు సైనికులు ఎన్కౌంటర్లో నలుగురు ముష్కరులను మట్టుబెట్టి వారు కూడా తీవ్రవాదుల బుల్లెట్లకు నేలకొరిగారు. 

ఏప్రిల్ 1వ తేదీన ముష్కరులు భారత్ లోకేమి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారన్న సిగ్నల్స్ ని కుప్వారా సెక్టార్ లోని సైనికులు వారి సాతేల్లితే కమ్యూనికేషన్ ద్వారా ట్రేస్ చేయగలిగారు. కానీ వారిని పూర్తి స్థాయిలో మాత్రం గుర్తించలేకపోయారు. ఏప్రిల్ 5వ తేదీన స్పెషల్ ఫోర్సెస్ టీం కి చెందిన సైనికులు వచ్చారు. 

కొండా అంచున పేరులున్న మంచుపై నిలబడి ఉండగా ఆ మంచుకుప్పకూలడంతో వారు కింద పడ్డారు. నేరుగా ముష్కరులు తలదాచుకున్న స్థావరంలోనే పడడంతో భారత సైనికులు అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించి వారందరిని మట్టుబెట్టారు. తప్పించుకుపోయిన ఒక ముష్కరుడ్ని కూడా ఎల్వోసీ వద్ద భారత సైన్యం మట్టుబెట్టింది. 

ఈ ఎదురుకాల్పుల్లో భారత స్పెషల్ టీం కి చెందిన సుబేదార్ సంజీవ్ కుమార్, హవాల్దార్ దవేంద్ర సింగ్, లతో సహా ముగ్గురు సిపాయిలో బాల క్రిషన్, అమిత్ కుమార్, ఛత్రపాల్ సింగ్ మృతి చెందారు.