Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేసింది. తాను ప్రయాణిస్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. తాను ప్రయాణిస్తున్న విమానం ఎదుట మరో విమానం ప్రత్యేక్షమయ్యిందనీ.. తన విమానాన్ని ఢీ కొట్టే ప్రయత్నం చేసిందనీ తెలిపారు. పైలట్ చాకచక్యంతో విమానం కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకుంది.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి విమాన ప్రమాదం తప్పింది. తాను ప్రయాణిస్తున్న విమానం తీవ్ర కుదుపులకు గురైందని.. స్వయంగా మమతా బెనర్జీ నే సంచలన ప్రకటన చేసింది. ఆమె సోమవారం అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించింది. తాను ప్రయాణిస్తున్న చార్టర్డ్ ఫైట్ కి ఎదురుగా మరో విమానం వచ్చిందన్నారు. తన ఫైలట్ చాకచాక్యంగా వ్యవహరించడంతో.. పెను ప్రమాదం తప్పిందని అన్నారు. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడినట్లు మమత చెప్పారు. విమానం గురించి ఏటీసీ, డీజీసీఏ నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు.
గత శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో సమాజ్‌వాదీ పార్టీ తరఫున ప్రచారానికి వెళ్లిన మమతా బెనర్జీ... ఆరోజు సాయంత్రం వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయానమయ్యారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా మరో విమానం తన విమానం ఎదురుగా వచ్చిందనీ, దీంతో విమానం భారీ కుదుపులకు గురైందని తెలిపారు. మరో పది సెకన్లు ఇలాగే సాగితే రెండు విమానాలు ఢీకొనేవని మమతా బెనర్జీ తెలిపారు. తాము ప్రయాణిస్తున్న విమానం ఆరు వేల అడుగున వెళుతుందన్నారు. కానీ పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదాన్ని తప్పించారని చెప్పారు. వెంటనే విమానాన్ని నేతాజీ సుభాష్ చంద్ర అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ లాండ్ చేశాడు పైలట్. ఈ ప్రమాదంలో తన వెన్నముకకు, ఛాతీకి గాయాలయ్యాయని తెలిపారు. ఇప్పటికీ నొప్పిగా ఉందన్నారు.
ఇంతకుముందు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా.. ఆమెకు పెను ప్రమాదం తప్పింది. దీనిపై వివరణ ఇవ్వాలని శనివారం సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ)ను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోరింది. అయితే, ఈ ఘటన సమయంలో మమతా బెనర్జీ 'దసో ఫాల్కాన్ 2000' అనే విమానంలో ప్రయాణించారు. ఇది 10.3 టన్నుల బరువున్న తేలికపాటి విమానం. ఇందులో ఇద్దరు సిబ్బంది సహా గరిష్ఠంగా 19 మంది ప్రయాణించొచ్చు. కాగా, ఘటనపై స్పందిస్తూ వీఐపీల భద్రత విషయంలో ఎలాంటి పొరపాటు జరగదని డీజీసీఏ పేర్కొన్నట్లు సమాచారం.
