Asianet News TeluguAsianet News Telugu

బ్రేకింగ్.. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై ఐదేళ్ల నిషేధం.. తక్షణమే అమల్లోకి..

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా దాని అసోసియేట్‌లు లేదా అనుబంధ సంస్థలు లేదా ఫ్రంట్‌లను చట్టవిరుద్ధమైన సంఘాలుగా కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఐదు సంవత్సరాల పాటు వీటిమీద నిషేధం విధించింది. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని ప్రకటించింది. 

Day after mega crackdown, Centre bans radical outfit Popular Front of India
Author
First Published Sep 28, 2022, 7:03 AM IST

ఢిల్లీ : పీఎఫ్ఐ సంబంధించిన వివిధ సంస్థల మీద అనేక దాడుల తర్వాత, టెర్రరిస్ట్ ఫండింగ్‌తో సంబంధాలు ఉన్నాయని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఎ) బుధవారం నిషేధించింది. దేశవ్యాప్తంగా అనేక దాడులు, దర్యాప్తు సంస్థల అరెస్టుల తరువాత, ఇవి తీవ్రవాద నిధులతో నడుస్తున్నాయని వచ్చిన ఆరోపణలపై రాడికల్ సంస్థ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) ను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) బుధవారం నిషేధించింది.

వీటని నిషేధించాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. దర్యాప్తు సంస్థల నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.సెప్టెంబర్ 22, సెప్టెంబర్ 27 తేదీల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), రాష్ట్ర పోలీసులు పీఎఫ్‌ఐపై దాడులు చేశారు. తొలి దఫా దాడుల్లో పీఎఫ్‌ఐకి చెందిన 106 మందిని అరెస్టు చేశారు. అనంతరం, రెండవ రౌండ్ దాడులలో, PFIకి చెందిన 247 మందిని అరెస్టు చేశారు. దర్యాప్తు సంస్థలకు ఈ ముసుగు సంస్థలకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలు లభించాయి, దాని ఆధారంగా వీటిని నిషేధించాలనే నిర్ణయం తీసుకున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios