ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్‌ఘడ్ జిల్లాలో జర్నలిస్ట్ అనుమానాస్పదస్థితిలో మరణించాడు. తన ప్రాణాలకు ముప్పుందని ఫిర్యాదు చేసిన మరునాడే జర్నలిస్ట్ అనుమానాస్పదస్థితిలో మరణించడం చర్చకు దారితీసింది.
న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్‌ఘడ్ జిల్లాలో జర్నలిస్ట్ అనుమానాస్పదస్థితిలో మరణించాడు. తన ప్రాణాలకు ముప్పుందని ఫిర్యాదు చేసిన మరునాడే జర్నలిస్ట్ అనుమానాస్పదస్థితిలో మరణించడం చర్చకు దారితీసింది. ప్రతాప్‌ఘడ్ జిల్లాకు మద్యం మాఫియాకు వ్యతిరేకంగా వార్త కథనాలు అందించిన జర్నలిస్ట్ సులాబ్ శ్రీవాస్తవ అనుమానాస్పదస్థితిలో మరణించాడు. తనకు ప్రాణభయం ఉందని పోలీసు ఉన్నతాధికారికి లేఖ రాసిన 24 గంటల్లో చనిపోయాడు. శ్రీవాస్తవ రోడ్డు ప్రమాదంలో మరణించినట్టుగా పోలీసులు ప్రకటించారు.
మద్యం మాఫియాపై ఈ నెల 9వ తేదీన శ్రీవాస్తవ కథనాన్ని ప్రసారం చేశారు. అప్పటి నుండి తనకు బెదిరింపులొస్తున్నాయని శ్రీవాస్తవ చెప్పారు. తనకు రక్షణ కల్పించాలని కూడ ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయమై విచారణ జరపాలని పోలీసు ఉన్నతాధికారి ఆదేశించారు. కానీ ఈ లేఖ రాసిన 24 గంటల్లోనే శ్రీవాస్తవ మరణించడం కలకలం రేపుతోంది.అలీఆగర్ నుండి ప్రతాప్‌ఘర్ వరకు మద్యం మాఫియా వేళ్లూనుకొందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శించారు.
