Asianet News TeluguAsianet News Telugu

జర్నలిస్ట్ మృతి : ప్రాణభయం ఉందని లేఖరాసిన 24 గంటల్లోనే..

ఉత్తరప్రదేశ్ ప్రతాప్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.  మద్యం మాఫియా పై సంచలన కథనాలను అందించిన ఓ టీవీ జర్నలిస్ట్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. తన ప్రాణాలకు ముక్కు ఉందని,  రక్షణ కల్పించాలని కోరుతూ జర్నలిస్టు సులాబ్ శ్రీవాత్సవ (42) పోలీసు ఉన్నతాధికారికి లేఖ రాసిన 24 గంటల్లోనే ఆదివారం రాత్రి అనుమానాస్పద రీతిలో శవమై కనిపించాడు.

Day After Flagging Mafia Threat, UP Journalist Dies; Cops Say 'Accident' - bsb
Author
Hyderabad, First Published Jun 14, 2021, 3:31 PM IST

ఉత్తరప్రదేశ్ ప్రతాప్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.  మద్యం మాఫియా పై సంచలన కథనాలను అందించిన ఓ టీవీ జర్నలిస్ట్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. తన ప్రాణాలకు ముక్కు ఉందని,  రక్షణ కల్పించాలని కోరుతూ జర్నలిస్టు సులాబ్ శ్రీవాత్సవ (42) పోలీసు ఉన్నతాధికారికి లేఖ రాసిన 24 గంటల్లోనే ఆదివారం రాత్రి అనుమానాస్పద రీతిలో శవమై కనిపించాడు.

అయితే, పోలీసులు మాత్రం ప్రమాదం రోడ్డు ప్రమాదంలోనే శ్రీవాత్సవ చనిపోయినట్టు భావిస్తున్నారు.  శ్రీవత్సవ ఆదివారం రాత్రి 11 గంటలకు విధులు ముగించుకుని బైక్ పై ఇంటికి వస్తుండగా,  దుండగులు అతని పై ఎటాక్ చేశారు.  తీవ్రంగా కొట్టి, ఒంటిపై బట్టలను దాదాపు తీసేసి రోడ్డుపక్కన వదిలేసి పోయినట్లు తెలుస్తోంది.  అయితే పోలీసుల వెర్షన్ మాత్రం భిన్నంగా ఉంది.

శ్రీవాత్సవ బైక్ పై నుంచి కిందికి పడి, తలకు దెబ్బ తగలడంతో చనిపోయాడని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. అపస్మారక స్థితిలో శ్రీవాత్సవను గుర్తించిన  స్థానికులు కొంతమంది ఆస్పత్రికి తరలించారని,  అప్పటికే అతను ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ప్రకటించారని సీనియర్ పోలీసు అధికారి సురేంద్ర ద్వివేది ప్రకటించారు.  ఇతర కోణాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు.

ఈ ఘటనపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, యూపీ యోగి సర్కారుపై మండిపడ్డారు.  అలీఆగర్‌నుంచి ప్రతాప్‌ఘర్‌ వరకు మద్యం మాఫియా వేళ్లూనుకొందని విమర్శించారు.  నిజాలను బయటపెడుతున్న జర్నలిస్టులపై దాడులు జరుగుతుంటే.. ప్రభుత్వం నిద్రపోతోందంటూ ప్రియాంక ట్వీట్‌ చేశారు.

కాగా జిల్లాలోని మద్యం మాఫియాకు వ్యతిరేకంగా జూన్ 9న సంచలన కథనాన్ని ప్రసారం చేసినప్పటి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని,  తన ప్రాణాలకు భయం ఉందంటూ సీనియర్ పోలీస్ అధికారి కి లేఖ రాశారు. 

దీంతో తాను, తన కుటుంబం కూడా చాలా ఆందోళన చెందుతోందని.. రక్షణ కల్పించాలని శ్రీవాత్సవ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను ధృవీకరించిన సీనియర్ పోలీసు అధికారి దీనిపై విచారణ నిమిత్తం స్థానిక అధికారులకు సూచించినట్లు చెప్పారు.  ఈ నేపథ్యం మృతి శ్రీవాత్సవ మృతి భయాందోళన రేపింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios