అత్తతో తల్లి గొడవపడుతోందని తల్లిని అతి దారుణంగా హత్య చేసింది ఓ కూతురు. ఆ తరువాత తల్లి మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కింది. 

బెంగళూరు : అత్తతో తల్లి గొడవ పడుతోందని.. తల్లిని చంపి సూట్ కేసులో కుక్కింది ఓ కూతురు. ఆ తరువాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. బెంగళూరులోని మైకో లేఅవుట్ కు చెందిన సోనాలి తన అత్త, తల్లిలతో కలిసి ఒకే అపార్ట్మెంట్లో ఉంటుంది. నిత్యం కూతురి అత్తతో తల్లి గొడవపడుతుంది. అలా చేయొద్దు అంటూ తల్లికి ఎన్ని సార్లు చెప్పినా వినడం లేదు.

పైగా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటానంటూ కూతురిని బెదిరించింది తల్లి. దీంతో వింతో విసిగిపోయిన కూతురు తల్లిని చంపి, మృతదేహాన్ని ట్రాలీ సూట్ కేసులో కుక్కింది. ఆ తరువాత పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. ఆమె మీద సెక్షన్ 302, ఇంక వేరే సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.