Asianet News TeluguAsianet News Telugu

మహారాష్ట్రలో షాకింగ్ ఘటన.. టీవీ ఆపిందని అత్త వేళ్లు విరిచిన కోడలు...

ఓ కోడలు అత్తమీద దాష్టీకం ప్రదర్శించింది. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు వాగ్వాదానికి దిగి.. చేతివేళ్లను విరిచేసింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. 

daughter-in-law broke Aunt's fingers because she stopped the TV In Maharashtra
Author
First Published Sep 8, 2022, 10:32 AM IST

మహారాష్ట్ర : కోడళ్లను అత్తలు రాచిరంపాన పెట్టడం ఓల్డ్ ట్రెండ్.. అత్తలనే కోడళ్లు హింసించడం న్యూ ట్రెండ్.. దీన్నే ఫాలో అయింది ఓ కోడలు.  మహారాష్ట్రలోని ఠాణె జిల్లా అమర్నాథ్ కు చెందిన ఓ ఇంట్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. టీవీ సౌండ్ తగ్గించమని అడిగిన అత్త చేతి వేళ్లను విరిచేసింది ఓ కోడలు.. వివరాల్లోకి వెళితే అత్త వృశాలీ కులకర్ణి (60) పూజ చేసుకుంటూ ఉండగా హాలులో ఉన్న కోడలు విజయ (32) టీవీ చూస్తోంది. సౌండ్ తో పూజకు అంతరాయం కలుగుతోందని, టీవీ బంద్ చేయమని అంతా కేకేసింది.

కోడలు ఆ మాటలు పెడచెవిన పెట్టి వ్యాల్యూం ఇంకా పెంచింది. కోపం పట్టలేక అత్త నేరుగా వచ్చి టీవీ బంద్ చేసింది. దీంతో కోడలు మరింత రెచ్చిపోయింది. తగ్గేదే లేదు అన్నట్లు ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది. అత్త వేలు చూపించి మాట్లాడడంతో ఆమె చేతి వేళ్లను విరిచేసింది. ఇద్దరికీ సర్ధి చెబుదామని ఇంటి లోపలి నుంచి సౌరవ్ రాగా.. భార్య విజయ చేతికి చేతిలో అతనికీ దెబ్బలు తప్పలేదు. మూడు వేళ్లు విరిగిన అత్త బుధవారం శివాజీనగర్ ఠాణాలో కోడలిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఫోన్ మాట్లాడొద్ద‌ని చెప్పినందుకు అత్త‌ను చంపిన కోడలు.. ఎక్క‌డంటే ?

ఇదిలా ఉండగా, గత జూన్ లో ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉందని ఆగ్రహంతో ఓ మహిళను.. ముగ్గురు వ్యక్తులు కలిసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ విషయం మీడియాకు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం..  సామర్లకోట మండలంలోని జి మేడపాడుకు చెందిన బత్తిన మాణిక్యం మార్చి 19 నుంచి కనిపించడం లేదు. దీనిపై ఆమె భర్త మార్చి 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్సై టి సునీత మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

కృష్ణ, మాణిక్యం దంపతుల కుమారుడు గతంలో మరణించాడు. అతడి భార్య.. అత్త వారి ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు అదే గ్రామానికి చెందిన వందే వెంకన్న అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటోందని అక్కసుతో మాణిక్యాన్ని ఆమె కోడలు, వెంకన్నలు హతమార్చారని పోలీసులు నిర్ధారించారు. ఆమెను చంపేసిన తరువాత ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి గోదావరి కాలువలో పడేశారు.

ఇందుకు బంది పోలయ్య అనే వ్యక్తి సహాయం తీసుకున్నారని గుర్తించారు. వీఆర్ఓ యేడిద భరత్ సమక్షంలో నిందితులు ఈ విషయాన్ని అంగీకరించారని ఎస్ఐ తెలిపారు. ఈ నేపథ్యంలో మాణిక్యం అదృశ్యం కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు.  నిందితులు ముగ్గురినీ కోర్టులో హాజరు పరచి 14 రోజుల రిమాండ్ కు తరలించారు. మాణిక్యం మృతదేహం ఎక్కడ ఉందో గుర్తించి, స్వాధీనం చేసుకుని, డీఎన్ఎ టెస్టుకు పంపాలని ఎస్సై తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios