Asianet News TeluguAsianet News Telugu

తండ్రి రెండో పెళ్లిని ప్రశ్నించే అధికారం కూతురికి ఉంది.. బాంబే హై కోర్టు

తండ్రి రెండో పెళ్లిని ప్రశ్నించే అధికారం కూతురికి ఉందని బాంబే హై కోర్టు స్పష్టం చేసింది. తండ్రి రెండో పెళ్లి చెల్లుబాటుపై కోర్టులో ప్రశ్నించవచ్చని తెలిపింది. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు చెందిన అంవం కాబట్టి భార్య, లేదా భర్త మాత్రమే కోర్టులో దాని చెల్లుబాటుని ప్రశ్నించాలంటూ ఫ్యామిలీ కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును.. జస్టిస్ ఆర్ డి ధనూక, జస్టిస్ విజీ బిషత్ లతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం కొట్టివేసింది. 

Daughter Has Every Locus To Question Validity Of Father's Second Marriage: Bombay High Court - bsb
Author
Hyderabad, First Published Mar 20, 2021, 10:14 AM IST

తండ్రి రెండో పెళ్లిని ప్రశ్నించే అధికారం కూతురికి ఉందని బాంబే హై కోర్టు స్పష్టం చేసింది. తండ్రి రెండో పెళ్లి చెల్లుబాటుపై కోర్టులో ప్రశ్నించవచ్చని తెలిపింది. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు చెందిన అంవం కాబట్టి భార్య, లేదా భర్త మాత్రమే కోర్టులో దాని చెల్లుబాటుని ప్రశ్నించాలంటూ ఫ్యామిలీ కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును.. జస్టిస్ ఆర్ డి ధనూక, జస్టిస్ విజీ బిషత్ లతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం కొట్టివేసింది. 

66యేళ్ల మహిళ మరణించిన తన తండ్రి రెండో వివాహం చెల్లుబాటుపై ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ కోర్టు కెక్కారు. ఆ పిటిషన్ ను విచారించిన బాంబే హైకోర్టు కన్న కూతురిగా తండ్రి రెండో పెళ్లిని ప్రశ్నించే అధికారం ఆమెకు ఉందని తేల్చి చెప్పింది. 

2016లో ఒక మహిళ తన తండ్రి రెండో వివాహం చెల్లుబాటును ప్రశ్నిస్తూ ఫ్యామిలీ కోర్టు కెక్కారు. 2003లో ఆమె తల్లి మరణించాక తండ్రి రెండో వివాహం చేసుకున్నాడు. 2016లో తండ్రి 2016లో తండ్రి మరణించాక తన సవితి తల్లి మొదటి భర్తతో విడాకులు తీసుకోకుండానే తన తండ్రిని రెండో వివాహం చేసుకున్నట్లుగా ఆమెకి తెలిసింది. 

అంతేకాదు తన తండ్రి ఆస్తులన్నీ సవితి తల్లే అనుభవిస్తూ ఉండడంతో విడాకులు తీసుకోకుండా ఆమె చేసుకున్న పెళ్లి ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రశ్నిస్తూ ఫ్యామిలీ కోర్టుకెక్కింది కూతురు. 

అయితే ఫ్యామిలీ కోర్టులో సవితి తల్లి, వివాహం అనేది ఇద్దరి వ్యక్తులకు సంబంధించిన విషయం అని, దానికి చెల్లుబాటును కుమార్తె ఎలా ప్రశ్నిస్తారని వాదించారు. ఫ్యామిలీ కోర్టు సవితి తల్లికి అనుకూలంగా తీర్పు నిచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ కూతురు బాంబే హైకోర్టుకి వెళ్లగా అక్కడ ఆమెకు ఊరట లభించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios