నాగపూర్: మధ్యప్రదేశ్ లోని నాగపూర్ లో జరిగిన ఓ హత్య కేసులో దిగ్భ్రాంతి కలిగించే విషయం బయటపడింది. వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు మంగళవారంనాడు ఛేదించారు. వృద్ధ దంపతులు విగతజీవులై ఆదివారంనాడు తమ అపార్టుమెంటులో కనిపించారు. 

తల్లిదండ్రులను క్రికెటర్ అయిన తన ప్రియుడితో కలిసి కూతురే హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. దత్తపుత్రిక అయిన యువతి క్రికెటర్ ను ప్రేమించింది. వారిద్దరి వివాహానికి దంపతులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇద్దరు కలిసి వృద్ధ దంపతులను హతమార్చారు.

నిందితులు ప్రియాంక సాఫ్ట్ వేర్ ఇంజనీరు కాగా, ఆమె ప్రియుడు మొహమ్మద్ అఖ్లాక్ రాష్ట్రస్థాయి క్రికెటర్ క్రీడాకారుడు. వారిని అఖ్లాక్ గతంలో కూడా చంపడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. 

శంకర్ చంపతి (72), ఆయన భార్య సీమ (64) నాగపూర్ లోని వాడిలో గల తమ అపార్టుమెంటులో ఆదివారం సాయంత్రం విగతజీవులై కనిపించారు. వారి తలలపై బలమైన గాయాలు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు.

వృద్ధదంపతులకు విషం కలిపిన ఆహారం తినిపించి, వారిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తొలుత గొంతు నులిమారు. ఆ తర్వాత తలలపై బాదారు.