బీహార్ లో దేవుని దర్శనం కోసం ఆలయానికి వెళ్లిన నా ఓ భక్తురాలి కి చేదు అనుభవం ఎదురయింది. మూసి ఉన్న ఆలయంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన కారణంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు అర్చకుడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 

బీహార్ లో దారుణం జరిగింది. ఇటీవలి కాలంలో ఆలయంలో భక్తుల మీద ఆలయ సిబ్బంది దాడుల సంఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. మంత్రాలయం గుడిలో ఓ భక్తుడిని ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది చితకబాదారు. దెబ్బలకు తాళలేక కొట్టద్దు, కొట్టద్దు అని భక్తుడు ప్రాధేయపడిన సెక్యూరిటీ సిబ్బంది వదలలేదు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

డబ్బులిస్తేనే స్పెషల్ దర్శనమా అన్నందుకు ఓ వ్యక్తిని గుడిలోనే సెక్యూరిటీ సిబ్బంది చితకబాదారు. ఈ వీడియో వైరల్ గా మారింది. దీన్ని మరిచిపోకముందే.. బీహార్ లోని ఓ దేవాలయంలో మరో వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. 

బీహార్ లో దేవుని దర్శనం కోసం ఆలయానికి వెళ్లిన నా ఓ భక్తురాలి కి చేదు అనుభవం ఎదురయింది. మూసి ఉన్న ఆలయంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన కారణంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు అర్చకుడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 

బీహార్లోని దర్భాంగా లో ఉన్న ‘శ్యామా దేవాలయం’లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తర బీహార్ తో పాటు... నేపాల్ నుంచి భక్తులు అధికంగా వచ్చే ఈ ఆలయంలో పనిచేస్తున్న పూజారి భక్తురాలిని జుట్టు పట్టుకుని మరీ తీవ్రంగా కొట్టాడు.

 ఘటన తర్వాత ఆలయ కమిటీ పూజారిని తొలగించింది. సదరు మహిళకు మతిస్థిమితం సరిగా లేదని... గుడి తలుపు పగలగొట్టేందుకు ప్రయత్నించిందని... అందుకే కొట్టాల్సివచ్చింది అని పూజారి వివరణ ఇచ్చాడు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఈ వీడియోలో.. మహిళ జుట్టు పట్టుకుని పూజారి కొడుతుండడం కనిపించింది. ఈ చర్య ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని ఆలయ అధికారి ఒకరు తెలిపారు. మహిళ ప్రవర్తనపై ఇబ్బంది ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందని అభిప్రాయపడ్డారు.