Asianet News TeluguAsianet News Telugu

స్కూల్ బ్యాగులో వింత శబ్దాలు.. తీరా ఒపెన్ చేసి చూడగా గుండె గుభేల్!

మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లా  బదౌని స్కూల్లో  ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థి స్కూల్​ బ్యాగ్ లో ఓ నాగుపాము దర్మనమిచ్చింది. దీంతో తరగతి గదిలో గందరగోళం నెలకుంది.  

Dangerous Cobra Snake Found in Student School Bag in Madhya Pradesh
Author
First Published Sep 22, 2022, 11:09 PM IST

మామూలుగా పాము పేరు చెప్పితేనే చాలామందికి వెన్నులో వణుకు పుడుతుంది. మరికొందరూ పామును దూరం నుంచి చూసినా..దెబ్బకు దడుసుకుంటారు. అలాంటిది  ఓ పాము అనుకోకుండా మన దగ్గరకు వచ్చే.. మన పక్కనే ఉంటే.. ఇంకేమైనా ఉందా.! గుండె జారి గల్లంతయ్యిపోతది. ప్రాణ భయంతో ఒళ్లు గగుర్పాటుకు గురవుతోంది.  అయితే.. ఓ విద్యార్థి బ్యాగులో అనుకోని అతిధిలా  ఓ భారీ స్వర్పం దర్శనమిచ్చింది. ఓ విద్యార్థి తరగతిలో కూర్చుని.. ఎప్పటిలాగానే.. తన పుస్తకాలను బ్యాగులో నుంచి తీసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ బ్యాగులో ఎదో తెలియని వింత శబ్దం వచ్చింది. కానీ అదేమి పట్టించుకోకుండా.. ఆ విద్యార్థి తన బ్యాగును తెరిచి చూశాడు. తీరా చూసే సరికి..కంగుతిన్నాడు.

ఆ బ్యాగులో  ఓ నాగు పాము బుసలు కొడుతూ దర్శనమిచ్చింది. దీంతో  ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. బ్యాగులో పాము ఉందని తెలియడంతో విద్యార్థులు బయటకు పరుగులు దీశారు. ఒక్కనొక సమయంలో ఉపాధ్యాయులు కూడా భయంపడ్డారు. ఈ క్రమంలో  ఓ ఉపాధ్యాయుడు దైర్యం చేసి.. ఆ బ్యాగును క్లాస్ రూం నుంచి బయటకు తీసుకోచ్చాడు. నెమ్మదిగా.. బ్యాగులో నుంచి పుస్తకాలను బయటకు తీశాడు. ఆ పుస్తకాల మధ్యలో నుంచి పాము బుసలు కొట్టుకుంటూ.. బయటకు వచ్చింది. దీంతో అక్కడి వారందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లా  బదౌని స్కూల్లో వెలుగుచూసింది. ఆ విద్యార్థిని కానీ, ఇతర వ్యక్తులను ఆ పాము కాటు వేయకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే.. ఆ పాము విద్యార్థిని ఇంటి వద్దనే బ్యాగులోకి చొరబడి ఉండవచ్చునని భావిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios