మధ్య ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది.  దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ మైనర్ బాలికను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా బాలికను అత్యంత క్రూరంగా హతమార్చి రాక్షసానందం పొందారు.

ఈ దుర్ఘటన బుందేల్ ఖండ్ సమీపంలోని సాగర్ జిల్లా బెర్కెడా గ్రామంలో జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బెర్కెడా గ్రామంలోని ప్రభుత్వ  పాఠశాలలో ఓ 12ఏళ్ల మైనర్ బాలిక ఆరో తరగతి చదువుతోంది. అయితే శుక్రవారం స్కూల్లో వార్షిక పరీక్ష వుండటంతో ఉదయమే బాలిక పాఠశాలకకు బయలుదేరింది. కానీ ఆమెను మార్గమధ్యలో నుంచే కిడ్నాప్ చేసిన దుండగులు గ్రామ శివారులోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం అత్యంత క్రూరంగా బాలిక తల,, మొండెన్ని వేరుచేసి హతమార్చారు. 

అయితే సాయంత్రమైనా బడికెళ్లిన కూతరు ఇంటికి తిరిగి నాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు  గురయ్యారు. దీంతో పాఠశాలకు వెళ్లి  ఆరా తీయగా అసలు ఉదయం నుండి ఆమె స్కూల్ కు రాలేనట్లు సిబ్బంది చెప్పారు. దీంతో వారు మరింత ఆందోళనకు గురయ్యి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సాయంతో గ్రామంలో వెతికారు. ఈ క్రమంలో ఊరి శివారులోని బాలిక మృతదేహాన్ని గుర్తించారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్ధానిక పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. సంఘటనా ప్రాంతంలో పరిస్థితులు, బాలిక మృతదేహాన్ని బట్టి చూస్తూ అత్యాచారం జరిగిన తర్వాతే హత్య చేసి వుంటారని అనుమానిస్తున్నట్లు...అయితే పోస్టు మార్టం రిపోర్ట్ తర్వాత ఈ విషయాలన్ని బయట పడతాయని పోలీస్ ఆఫీసర్ సింగ్ తెలిపారు. కుటుంబ సభ్యుల అనుమానం మేరకు చోటా పటేల్  అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్లు వెల్లడించారు.