మంచి దుస్తులు ధరించి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నందుకు దళిత వ్యక్తిపై దాడి..
Palanpur: మంచి బట్టలు వేసుకుని, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నందుకు ఒక దళిత వ్యక్తిపై దాడి జరిగింది. దళిత వ్యక్తి అలా సూటుబూటు ధరించి, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవడం చూసి సహించలేని అగ్రవర్ణలకు చెందిన పలువురు వ్యక్తులు దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ లో చోటుచేసుకుంది.

Dalit Man Thrashed For Wearing Sunglasses: మంచి దుస్తులు ధరించి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నందుకు ఒక దళిత వ్యక్తిపై దాడి జరిగింది. దళిత వ్యక్తి అలా సూటుబూటు ధరించి, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవడం చూసి సహించలేని అగ్రవర్ణలకు చెందిన పలువురు వ్యక్తులు దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. మంచి బట్టలు, సన్ గ్లాసెస్ వేసుకున్నాడనే కోపంతో ఓ దళిత యువకుడిని అగ్రవర్ణానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. పాలన్ పూర్ తాలూకాలోని మోటా గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగిందనీ, వారి దాడికి గురైన బాధితుడు, అతని తల్లి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. మంచి దుస్తులు ధరించి, కళ్లజోడు ధరించినందుకు తనను, తన తల్లిని కొట్టారని బాధితురాలు జిగర్ షెఖలియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు చెప్పారు. మంగళవారం ఉదయం బాధితురాలు తన ఇంటి బయట నిల్చొని ఉండగా ఏడుగురు నిందితుల్లో ఒకరు తన వద్దకు వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చాలా ఎత్తుకు ఎదుగుతున్నావని చెబుతూ.. అతడి స్థాయిలో ఉండకపోతే చంపుతానని బెదిరించాడు.
అదే రోజు రాత్రి ఫిర్యాదుదారుడు గ్రామంలోని ఆలయం వెలుపల నిల్చొని ఉండగా రాజ్ పుత్ ఇంటిపేరు ఉన్న ఆరుగురు నిందితులు అతని వద్దకు వచ్చారు. కర్రలు పట్టుకుని సన్ గ్లాసెస్ ఎందుకు వేసుకున్నావని అడిగారు. అనంతరం అతడిని చితకబాది డెయిరీ పార్లర్ వెనుక ఈడ్చుకెళ్లారు. అతడిని కాపాడేందుకు తల్లి పరుగెత్తడంతో ఆమెపై కూడా దాడి చేసి చంపేస్తామని బెదిరించారు. వారు ఆమె దుస్తులను కూడా చింపేశారని ఫిర్యాదును ఉటంకిస్తూ పోలీసులు తెలిపారు. అల్లర్లు, చట్టవిరుద్ధంగా గుమిగూడడం, మహిళ గౌరవానికి భంగం కలిగించడం, స్వచ్ఛందంగా గాయపరచడం, అసభ్య పదజాలం ఉపయోగించడం వంటి భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్ల కింద ఏడుగురు నిందితులపై గాధ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అలాగే, నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసు అధికారి తెలిపారు.