Asianet News TeluguAsianet News Telugu

బాలుడికి దలైలామా లిప్ కిస్సులు, నాలుకను చప్పరించమంటూ.. వివాదాస్పదమవుతున్న వైరల్ వీడియో..

దలైలామా తన దగ్గరికి వచ్చిన ఓ భారతీయ చిన్నారిని లిప్ కిస్ చేసి.. నాలుకను తాకమంటూ అడగడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. 

Dalai Lama controversy video goes viral, Asking Minor Boy To Suck His Tongue - bsb
Author
First Published Apr 10, 2023, 7:41 AM IST

ఢిల్లీ : బౌద్ధ మత గురువు దలైలామా వివాదాల్లో చిక్కుకున్నారు.  తననాలుకను నోటితో తాకాలంటూ  ఓ బాలుడిని కోరాడు. ఈ ఘటన తాజాగా తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో దలైలామా ఆశీస్సులు అందుకోవడానికి వచ్చిన బాలుడి పెదవులపై ముద్దు పెట్టడం కనిపిస్తుంది. ఆ తరువాత ఆయన బాలుడిని నా నాలుకను తాకమని అడగడం అందులో కనిపిస్తుంది. ఈ  వీడియో సంచలనం రేపింది.

తన దగ్గరికి వచ్చిన బాలుడికి పెదవులపై ముద్దు పెట్టడమే కాకుండా.. బాలుడు నోటితో తన నాలుకను తాకాలంటూ... నాలుక బైటపెట్టడం కనిపిస్తుంది. ‘నువ్వు నా నాలుకను నోటితో తాకుతావా’ అని మైనర్ బాలుడిని అడిగడం కనిపిస్తుంది. అయితే ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగింది అనేది స్పష్టంగా తెలియలేదు. కానీ ఇప్పుడది వెలుగులోకి రావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకునపడుతున్నారు. 

దలైలామా ఇలా చేయడం.. "అసహ్యకరమైనది", "దౌర్జన్యం", "ఖండించదగినది" అని అనేక మంది నెటిజన్లు పేర్కొంది. వీడియోను ట్విట్టర్ షేర్ చేస్తూ.. "దలైలామా ఒక బౌద్ధ కార్యక్రమంలో భారతీయ బాలుడిని ముద్దుపెట్టుకుంటున్నాడు అతని నాలుకను తాకడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు. నిజానికి ఆ బాలుడిని "నా నాలుకను తాకుమని" కోరాడు. అతను ఎందుకు అలా చేస్తాడు?" అని రాసుకొచ్చాడు.

దీనిమీద స్పందిస్తూ ఒకరు
"@దలైలామా.. ఇది దారుణమైన విషయం.. ఈ దుష్ప్రవర్తనను ఎవరూ సమర్థించకూడదు" అని మరో ట్విట్టర్ యూజర్ మండిపడ్డారు. "ఏంటిది.. నేనేం చూస్తున్నాను? దలైలామా నేనా? పెడోఫిలియా కింద ఆయనని అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది. అసహ్యంగా ఉంది" అని మరొకరు ట్వీట్ చేశారు.

2019లో, దలైలామా తన వారసురాలు మహిళ కావాలంటే, ఆమె "ఆకర్షణీయంగా" ఉండాలని అన్నారు. అది అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసింది. ‘ఒక ఆడ దలైలామా వస్తే, ఆమె మరింత ఆకర్షణీయంగా ఉండాలి’.. అనే వ్యాఖ్య..ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారి తీసింది. ఈ వ్యాఖ్యలు, ధర్మశాలలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన దలైలామా 2019 లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేశారు.

ఆ తర్వాత తన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. గత నెలలో, దలైలామా యూఎస్ లో -జన్మించిన మంగోలియన్ అబ్బాయిని టిబెటన్ బౌద్ధమతంలో మూడవ అత్యున్నత ర్యాంక్ అయిన 10వ ఖల్ఖా జెట్సన్ దంపా రింపోచేగా పేర్కొన్నాడు. ఎనిమిదేళ్ల చిన్నారిని టిబెటన్ బౌద్ధమతంలో మూడవ అత్యున్నత లామాగా అభిషేకించే చర్య చైనాకు కోపం తెప్పించే అవకాశం ఉంది, ఇది తన సొంత ప్రభుత్వం ఎంపిక చేసిన బౌద్ధ నాయకులను మాత్రమే గుర్తిస్తానన్న మొండిపట్టుతో ఉంది.

దలైలామా టిబెట్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారని బీజింగ్ ఆరోపించింది. భారతదేశం, నేపాల్, కెనడా, యుఎస్‌తో సహా దాదాపు 30 దేశాలలో నివసిస్తున్న సుమారు 100,000 మంది ప్రవాస టిబెటన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ (సీటీఏ)ని ఇది గుర్తించలేదు.

 

Follow Us:
Download App:
  • android
  • ios