Asianet News TeluguAsianet News Telugu

ముగిసిన డైలీహంట్, ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్‌ల ‘‘StoryForGlory’’ టాలెంట్ హంట్

డైలీహంట్, ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ లిమిటెడ్ భారతదేశపు తదుపరి కథకుల కోసం ప్రారంభించిన #StoryForGlory టాలెంట్ హంట్ కార్యక్రమం ముగిసింది. దీనికి సంబంధించిన గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో రెండు కేటగిరీల కింద 12 మంది విజేతలను ఎంపిక చేశారు. 
 

Dailyhunt and AMG Media Networks Limited Conclude #StoryForGlory in a Grand Finale in Delhi
Author
First Published Sep 28, 2022, 4:26 PM IST

డైలీహంట్, ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ లిమిటెడ్ (ఆదానీ గ్రూప్ మద్ధతుగా వున్న ఫ్లాట్‌ఫామ్). భారతదేశపు తదుపరి కథకుల కోసం #StoryForGlory పేరిట దేశవ్యాప్తంగా టాలెంట్ హంట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన గ్రాండ్ ఫినాలే కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. వీడియో, ప్రింట్ అనే రెండు కేటగిరీల కింద 12 మంది విజేతలను ఎంపిక చేయడం ద్వారా దేశవ్యాప్తంగా టాలెంట్ హంట్ ముగిసింది. 

ఈ ఏడాది మే నెలలో ప్రారంభమైన నాలుగు నెలల నిడివి వున్న ఈ కార్యక్రమం కోసం 1000కి పైగా దరఖాస్తులు అందాయి. వీరిలో 20 మంది ప్రతిభావంతులను షార్ట్ లిస్ట్ చేశారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్ధులు ప్రముఖ మీడియా సంస్థ ఎంఐసీఏలో ఎనిమిది వారాల పాటు ఫెలోషిప్, రెండు వారాల లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను పొందారు. కఠినమైన శిక్షణ తర్వాత.. ఆరు వారాల పాటు తమ చివరి ప్రాజెక్ట్‌లో పనిచేశారు. అదే సమయంలో ప్రముఖ మీడియా పబ్లిషింగ్ సంస్థల సూచనలు అందుకున్నారు. ప్రోగ్రామ్ సమయంలో వారి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం, కథనాన్ని, కంటెంట్‌‌ను వివరించడాన్ని మెరుగుపరిచే విధానంపై దృష్టి పెట్టారు. 

ముగింపులో 20 మంది ఫైనలిస్టులు తమ ప్రాజెక్ట్‌లను సమర్పించారు. అందులో 12 మందిని విజేతలుగా ఎంపిక చేశారు. జ్యూరీలో డైలీహంట్ వ్యవస్థాపకుడు వీరేంద్ర గుప్తా.. సంజయ్ పుగాలియా (సీఈవో, ఎడిటర్ ఇన్ చీఫ్ ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ లిమిటెడ్)... అనంత్ గోయెంకా (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్).... అనుపమ చోప్రా (ఫిల్మ్ కంపానియన్)... శైలీ చోప్రా (షీ ది పిపుల్ ఫౌండర్) .... నిలీష్ మిశ్రా ( గావ్ కనెక్షన్ వ్యవస్థాపకుడు)... పంకజ్ మిశ్రా (ఫ్యాక్టర్ డైలీ కో ఫౌండర్)లు #StoryForGlory కార్యక్రమం సందర్భంగా ప్రజల నుంచి ప్రత్యేకమైన గొంతులను గుర్తించింది. జర్నలిజంలో వారి స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు సృజనాత్మక కంటెంట్‌తో మీడియా ఎకో సిస్టమ్‌ను రూపొందించడానికి అవకాశాన్ని అందించింది. 

ఈ సందర్భంగా డైలీ హంట్ వ్యవస్థాపకుడు వీరేంద్ర గుప్తా మాట్లాడుతూ... భారతదేశంలోని కథకులలో శక్తివంతమైన, ప్రతిభావంతులైన వారిని కనుగొనేందుకు తాము సాంకేతికతను ఉపయోగించుకున్నామని చెప్పారు. డిజిటల్ న్యూస్, మీడియా స్పేస్ గణనీయంగా పురోగమిస్తోంది. #StoryForGlory చొరవ ద్వారా భారతదేశంలో మీడియా ఎకో సిస్టమ్‌ను రూపొందించడంలో తమ నిబద్ధతను పునరుద్ధరిస్తున్నట్లు వీరేంద్ర అన్నారు. భారతదేశంలోని వర్థమాన కథకులు వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి, అభిరుచులను పంచుకోవడానికి అవకాశాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

ఏఎంజీ మీడియా నెట్‌వర్స్క్ లిమిటెడ్ సీఈవో, ఎడిటర్ ఇన్ చీఫ్ సంజయ్ పుగాలియా మాట్లాడుతూ.. సుపంపన్నమైన, వైవిధ్యమైన కథల భూమిగా భారతదేశం చాలా మంది కథకులకు నిలయమన్నారు. డైలీహంట్‌తో కలిసి తాము తర్వాతి తరం భారతదేశ చరిత్రకారులను గుర్తించగలిగామని సంజయ్ పేర్కొన్నారు. వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి, పెంపొందించడానికి అవసరమైన మద్ధతు, వేదికను అందించగలిగామని ఆయన చెప్పారు. #StoryForGloryకి మంచి స్పందన వచ్చిందని.. భారతదేశంలోని అత్యంత ప్రతిభావంతులైన క్రియేటర్‌లకు వారి సృజనాత్మక దార్శనికతలకు జీవం పోయడానికి మార్గాలను అన్వేషించడానికి మా నిబద్ధత ప్రతిబింబిస్తుందని సంజయ్ చెప్పారు. 

#StoryForGlory అనేది వీడియో, వ్రాతపూర్వక ఫార్మాట్‌లలో కరెంట్ అఫైర్స్, న్యూస్, సైన్స్, టెక్నాలజీ, కళలు, సంస్కృతి తదితర అంశాలపై భారతదేశంలో కంటెంట్ సృష్టికర్తలను కనుగొనే లక్ష్యంతో ప్రారంభించబడింది. డైలీహంట్ భారతదేశంలోని 15 భాషల్లో 1 మిలియన్‌కు పైగా కొత్త తరహా కంటెంట్‌లను అందిస్తోంది. డైలీహంట్‌లో కంటెంట్ లైసెన్స్ పొంది.. 50 వేలకు పైగా కంటెంట్ పార్ట్‌నర్స్ పనిచేస్తున్నారు. ఇండిక్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా భారతీయులకు వినోదాన్ని అందించే కంటెంట్‌ను కనుగొనడం, తెలియజేయడం డైలీహంట్ లక్ష్యం. 

డైలీహంట్ ప్రతి నెలా 350 మిలియన్ల మంది మంత్లీ యాక్టీవ్ యూజర్‌లకు సేవలందిస్తోంది. రోజుకు ఒక యాక్టీవ్ యూజర్ డైలీహంట్‌లో గడిపే సమయం 30 నిమిషాలు. దీని ప్రత్యేకమైన ఏఐ , ఎంఎల్ , డీప్ లెర్నింగ్ టెక్నాలజీలు కంటెంట్ స్మార్ట్ క్యూరేషన్‌ని ఎనేబుల్ చేస్తాయి. డైలీహంట్ యాప్ అండ్రాయిడ్, ఐవోఎస్‌, మొబైల్ వెబ్‌లలో అందుబాటులో వుంది. 

భారతదేశంలోని అహ్మదాబాద్ ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు కొనసాగిస్తోన్న అదానీ గ్రూప్ .. ఓడరేవులు, విమానాశ్రయాలు, లాజిస్టిక్స్, షిప్పింగ్, రైలు, వనరులు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, పునరుత్పాదక ఇంధనం, గ్యాస్, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కన్జ్యూమర్ ఫైనాన్స్, డిఫెన్స్ తదితర రంగాలలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ‘నేషన్ బిల్డింగ్’, ‘గ్రోత్ విత్ గుడ్‌నెస్’ అనే సూత్రానికి అనుగుణంగా ఆదానీ గ్రూప్ పనిచేస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios