బెంగళూరు: తండ్రుల దినోత్సవం రోజునే కర్ణాటకలో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. కన్నబిడ్డపై ఏడాదిగా కూతురిపై అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. ఈ సంఘటనపై అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని కొప్పళ జిల్లాలో చోటు చేసుకుంది. 

పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కొప్పళ తాలుకాలోని వెంకటాపురం గ్రామంలో 14 ఏళ్ల కూతురిని పశువులను మేపేందుకు తండ్రి తన వెంట తీసుకుని వెళ్లేవాడు. ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు 

నాలుగు రోజుల తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండడంతో బాలికను ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. ఆమెను వైద్యులు పరీక్షించి 8 నెలల గర్భంతో ఉందని తేల్చారు. చికిత్స అందిస్తుండగా ఆమె మగశిశువుకు జన్మనిచ్చింది. 

తల్లితో పాటు బంధువులు ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఏడాదిగా తండ్రి తనపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని బాలిక చెప్పింది. ఈ సంఘటన మానవత్వానికే మచ్చ తెచ్చేదిగా ఉంది. సంఘటనపై స్థానికంగా తీవ్ర కలకలం చెలరేగింది.