Asianet News TeluguAsianet News Telugu

9 నిమిషాల్లో 20 కిలో మీటర్లు.. ప్ర‌మాద‌ సమయంలో సైరస్ మిస్త్రీ చేసిన త‌ప్పదేనా?

టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆదివారం సాయంత్రం జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తెలిసిందే. అయితే..  పోలీసుల ప్రాథమిక విచారణలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

Cyrus Mistry Was In Back Seat Wasn't Wearing Seat Belt
Author
First Published Sep 5, 2022, 11:19 AM IST

టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆదివారం సాయంత్రం జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయ‌న‌ మహరాష్ట్రలోని అహ్మదాబాద్ నుంచి ముంబాయి ప్రయాణిస్తుండగా.. పాల్గర్ సమీపంలోని చరోటి దగ్గర అతివేగంతో ప్రయాణిస్తున్న ఆయ‌న కారు అదుపుతప్పి.. డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశారు. 

ఈ ప్ర‌మాదంపై విచార‌ణ చేపట్టిన పోలీసులు ఆసక్తికర విష‌యాలను వెల్ల‌డిస్తున్నారు.ప్ర‌మాదం స‌మ‌యంలో సైరస్ మిస్త్రీతో పాటు జహంగీర్ పండోల్ లు వెనుక సీట్లలో కూర్చున్నారనీ, అయితే.. వారిద్దరూ సీటు బెల్టు పెట్టుకోలేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. 

ప్రాథమిక విచారణ ప్రకారం.. అతివేగం కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. పాల్ఘర్ లోని చరోటీ చెక్‌పోస్టు దాటిన తర్వాత కారు కేవలం 9 నిమిషాల్లో 20 కిలో మీటర్లు ప్ర‌యాణించిన‌ట్టు గుర్తించారు. చరోతి చెక్‌పోస్టులో ఉన్న‌ సీసీకెమెరాల ఫుటేజీని చూసిన పాల్ఘర్ పోలీసులు మధ్యాహ్నం 2.21 గంటలకు మిస్త్రీ కారు పోస్ట్‌ గుండా వెళ్లిందని, మధ్యాహ్నం 2.30 గంటలకు 20 కిలోమీటర్ల  దూరంలో (ముంబై దిశలో) ప్రమాదానికి గురైన‌ట్టు గుర్తించారు. 

మ‌రో ఆస‌క్తిక‌ర విష‌మేమిటంటే.. ప్రమాద సమయంలో ఓ లేడీ డాక్ట‌ర్ కారు డ్రైవ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.  అనహిత పండోల్ రాష్ డైవింగ్ ప్రమాదానికి  మ‌రో కార‌ణ‌మ‌ని  అధికారులు తెలిపారు.  
ముంబైకి చెందిన ప్ర‌ముఖ‌ గైనకాలజిస్ట్ అనహిత పండోలే కారు నడుపుతున్నారనీ, అతివేగంగా ఉన్న కారు.. సూర్య నదిపై ఉన్న వంతెనపై వెళ్లున్న త‌రుణంలో మ‌రో వాహనాన్ని ఓవ‌ర్ టేక్ చేస్తున్న క్ర‌మంలో అదుపుత‌ప్పి.. డివైడర్‌ను ఢీకొట్టిందని పోలీసులు గుర్తించారు. 

అనహిత భర్త డారియస్ ముందు సీట్లలో కూర్చున్నార‌నీ, తీవ్రంగా గాయపడిన ఆయ‌న‌ చికిత్స పొందుతున్నారు. ఈ రోజు అనహిత, డారిరస్‌లను ముంబై ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది. ప్రమాదం తర్వాత వారిని గుజరాత్‌లోని వాపిలోని ఓ  ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ముందు సీటులోని ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవ‌డంతో  డాక్ట‌ర్ దంప‌తుల‌కు పెను ప్ర‌మాదం త‌ప్పింద‌ని గుర్తించార‌ని వెల్ల‌డించింది.  మోటారు వాహనాల చట్టం ప్రకారం ముందు, వెనుక సీట్లలో ఉన్న వ్యక్తి సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి.

టాటా సన్స్‌కు ఆరో చైర్మన్‌గా ఉన్న సైరస్ మిస్త్రీని అక్టోబర్ 2016లో పదవి నుంచి తొలగించారు. రతన్ టాటా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత డిసెంబర్ 2012లో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అతనికి భార్య రోహికా, ఇద్దరు కుమారులు ఉన్నారు.

టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలలో మాజీ స్వతంత్ర డైరెక్టర్ అయిన డారియస్ పండోల్ కంపెనీ ఛైర్మన్‌గా మిస్త్రీని తొలగించడాన్ని వ్యతిరేకించారు. మిస్త్రీతో పాటు టాటా గ్రూప్‌ను కూడా విడిచిపెట్టాడు. జహంగీర్ పండోల్ డారియస్ పండోల్ సోదరుడు.

మిస్త్రీ మృతికి ప్రధాని మోదీతో పాటు దేశంలోని పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీట్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. సమాచారం ప్రకారం, మిస్త్రీ మృతదేహానికి పోస్ట్‌మార్టం ఈరోజు ముంబైలోని జేజే ఆసుపత్రిలో చేయవచ్చు. అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం వారి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios