Asianet News TeluguAsianet News Telugu

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఒడిశా స‌హా ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు

Heavy Rain: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయ‌ని భారత వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ద‌క్షిణ భార‌త ప్రాంతంపై కూడా ప్ర‌భావ‌ముంటుంద‌ని తెలిపింది. మంగళవారం ఉదయం నుంచి మల్కన్ గిరి, కోరాపుట్, నబరంగాపూర్, రాయగడ, గజపతి, గంజాంలో వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ ఇంటీరియర్ ఒడిశాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.
 

cyclonic storm in the Bay of Bengal, Heavy rains lash several parts of the state, including Odisha RMA
Author
First Published Jul 25, 2023, 2:13 PM IST

Cyclonic storm in Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 26న అల్పపీడనంగా మారే అవకాశం ఉందనీ, చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొంది. మంగళవారం ఉదయం నుంచి మల్కన్ గిరి, కోరాపుట్, నబరంగాపూర్, రాయగడ, గజపతి, గంజాంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ ఇంటీరియర్ ఒడిశాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ బులెటిన్ లో పేర్కొంది.

భారీ వ‌ర్షాల‌ను ప్ర‌స్తావిస్తూ ఐఎండీ మంగళ, బుధవారాల్లో ఆరెంజ్ అలర్ట్  జారీ చేసింది. మంగ‌ళ‌వారం గజపతి, గంజాం, పూరీ, మల్కన్ గిరి, కోరాపుట్, రాయగడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నబరంగ్పూర్, కలహండి, కంధమాల్, బలంగిర్, నయాగఢ్, ఖుర్దా, కటక్, జగత్సింగ్ పూర్, మయూర్ భంజ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

ఐఎండీ బులిటెన్ ప్ర‌కారం... బుధ‌వారం మల్కన్‌గిరి, కోరాపుట్, నబరంగాపూర్, రాయగడ, గజపతి, గంజాం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంద‌ని పేర్కొంటూ ఎల్లో అల‌ర్ట్ జారీ చేశారు. అలాగే, గంజాం, గజపతి, పూరి, రాయగడ, మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేశారు.

ఇక గురువారం రోజున మల్కన్‌గిరి, కోరాపుట్, నబరంగాపూర్, కలహండి, నువాపడ, బోలంగీర్ జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. శుక్ర‌వారం కోరాపుట్, నబరంగాపూర్, కలహండి, నువాపాడా, బోలంగీర్, సోనేపూర్, బర్గర్, సంబల్‌పూర్, ఝర్సుగూడ, సుందర్‌ఘర్, దేవ్‌ఘర్, అంగుల్, కియోంజర్ జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios