న్యూఢిల్లీ: దేశంలోని ఆరు రాష్ట్రాలను టౌటే తుఫాన్ వణికిస్తోంది. ఈ తుఫాన్ ప్రభావంతో కేరళ రాష్ట్రంలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కేరళ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోతోంది. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం,కోజికోడ్‌ జిల్లాలో  ఈ వర్షాలతో ఇద్దరు మరణించారు.టౌటే తుఫాన్ తీవ్రమైన తుఫాన్ గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.  మే 18వ తేదీన ఉదయం ఈ తుఫాన్ గుజరాత్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ తుఫానో్ ప్రభావంతో ముంబైలో కూడ ఆదివారం నాడు మధ్యాహ్నం ను వర్షాలు కురిసే అవకాశం ఉందని ముంబైలోని ఐఎండి సీనియర్ డైరెక్టర్ శుభాని భూటే చెప్పారు. 

also read:కేరళపై మొదలైన తౌక్టే ఎఫెక్ట్: పోటెత్తుతున్న వరదనీరు... రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్

ఐఎండీ ఇప్పటికే ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది. ఆరెంజ్ అలెర్ట్ అంటే భారీ నుండి అతి భారీ వర్షాలకు సూచికగా వాతావరణ శాఖాధికారులు చెబుతారు. కొంకణ్ తో పాటు ఎత్తైన ప్రదేశాలు, మహారాష్ట్రలోని పశ్చిమప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉంందని తెలిపారు. మహారాష్ట్రలోని సతారా, కొల్హాపూర్ ప్రాంతాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు తెలిపారు. 

గుజరాత్ తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జునాఘడ్, పోర్‌బందర్, దేవభూమి, ద్వారకా, అమ్రేలి, రాజ్‌కోట్, జామ్ నగర్ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.  టౌటే తుపాన్ రానున్న 12 గంటల్లో తీవ్రమైన తుఫాన్ గా మారే అవకాశం ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా వెళ్లి ఈ నెల 18వ తేదీ గుజరాత్ తీరానికి చేరుకొంటుంది పోరు బందర్ నలియా మధ్య గుజరాత్ తీరాన్ని ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. ఈ తుఫాన్ ప్రభావం, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, కేరళతో పాటు  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.