Cyclone Remal : ప‌శ్చిమ బెంగాల్ తో పాటు అసోం, త్రిపుర, మణిపూర్, మేఘాలయ, మిజోరంలలో రెమాల్ తుఫాను కారణంగా సంభవించిన ప్రకృతి వైపరీత్యాల పట్ల తాము చాలా ఆందోళన చెందుతున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 

Cyclone Remal - Amit Shah : గత నాలుగు రోజులుగా రెమాల్ తుఫాను బీభ‌త్సంతో ఈశాన్య రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో కనీసం 40 మంది మరణించగా, రెండు లక్షల మందికి పైగా ప్రభావితమయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో రైల్వే ట్రాక్ లను వరద నీరు ముంచెత్తింది. దక్షిణ అసోం, త్రిపుర, మణిపూర్, మిజోరాం రాష్ట్రాలకు వెళ్లే ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్, గూడ్స్ రైళ్లను ఈశాన్య సరిహద్దు రైల్వే (ఎన్ఎఫ్ఆర్) మంగళవారం నుంచి రద్దు చేసింది.

రెమాల్ తుఫానుతో పశ్చిమ బెంగాల్‌తో పాటు, ఈశాన్య రాష్ట్రాల్లోని అరడజను రాష్ట్రాల్లో వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. రమాల్ తుఫాను విధ్వంసం తర్వాత జీవితాలను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, విపత్తు నిర్వహణ బృందాలు నిరంతరం పని చేస్తున్నాయి. రమాల్ తుఫాను వల్ల సంభవించిన నష్టంపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

అమిత్ షా ఏం చెప్పారంటే..? 

అసోం, త్రిపుర, మణిపూర్, మేఘాలయ, మిజోరంలలో రెమాల్ తుఫాను కారణంగా సంభవించిన ప్రకృతి వైపరీత్యాల పట్ల తాము చాలా ఆందోళన చెందుతున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బాధిత ప్రజలకు సంఘీభావం తెలిపిన పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీకి కూడా తెలియజేశారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి, పరిస్థితిని సమీక్షించి, అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామ‌ని తెలిపారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామనీ, బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు.

Scroll to load tweet…

టెన్ష‌న్ పెంచుతున్న భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024కు ఉగ్రముప్పు