Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడుపై మాండూస్ ప్రభావం.. అస్తవ్యస్త మవుతోన్న జనజీవితం.. చెన్నై సహా 3 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌..

మాండూస్ తుఫాను : తీవ్ర తుపానుగా మారిన మాండూస్ తుఫాను శుక్రవారం అర్థరాత్రి తీరాన్ని తాకింది, గంటకు 75 కిలోమీటర్ల వేగంతో తమిళనాడు తీరం దాటింది. తుపాను తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఈ తుఫాను కారణంగా దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Cyclone Mandous Uproots Trees, Leaves Chennai Roads Waterlogged
Author
First Published Dec 10, 2022, 9:11 AM IST

మండూస్ తుఫాను: బంగాళాఖాతంలో ఏర్పడిన మండూస్ తుఫాను దక్షిణాది రాష్ట్రాల్లో తన ప్రభావాన్ని చూపుతోంది. ఈ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మండూస్ తుపానుకు సంబంధించి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. డిసెంబర్ 11వ తేదీ వరకు పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు.ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ  కారణంగా పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. తుపాను ప్రభావిత రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.

ఇలాఉంటే..  తుపాను శుక్రవారం రాత్రి తమిళనాడు తీర ప్రాంతాలను తాకింది. తుపాను కారణంగా చెన్నైలో భారీ వర్షాలు కురిశాయి. అసహజ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెన్నైలో పాఠశాలలు, కళాశాలలు కూడా మూతపడ్డాయి. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. మాండస్ తుఫాను శనివారం (డిసెంబర్ 10) సాయంత్రం వరకు తుఫాన్ బలహీనపడి తీరం దాటే అవకాశముందని అంచనా.  
 
మాండూస్ తుఫాను ప్రభావిత రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎఫ్( NDRF),ఎస్డీఆర్ఎఫ్(SDRF)బృందాలు కూడా అలర్ట్ మోడ్‌లో ఉన్నాయి. ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి తమ బృందాలు సిద్ధంగా ఉందని ఎన్‌డిఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ తెలిపారు. సహాయం కోసం.. ఎప్పుడు పిలిచినా వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంటామనీ. దీంతో పాటు జిల్లా విపత్తు రెస్పాన్స్ ఫోర్స్‌కు చెందిన 12 బృందాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. అదే సమయంలో.. వాతావరణ శాఖ ప్రకారం, శనివారం (డిసెంబర్ 10) నుండి బలమైన గాలుల వేగం గంటకు 50-60 కి.మీ.కు తగ్గుతుంది. ఆ తర్వాత రాత్రికి 40-50 వేగంతో దూసుకుపోతాయని తెలిపింది.

తమిళనాడుపై అధిక ప్రభావం.. 

మాండూస్ తుపాన్ ప్రభావం తమిళనాడులో అధికంగా ఉంది. శుక్రవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తీరం దాటింది. తమిళనాడులోని మామల్లపురం (మహాబలిపురం) సమీపంలో, పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య తెల్లవారుజామున 1.30 గంటలకు గంటకు 75 కి.మీ వేగంతో గాలులు వీచాయి. ఉదయం 5.30 గంటల వరకు చెన్నైలో 115.1 మిల్లీమీటర్ల వరకు వర్షం పడడంతో అది తీవ్ర అల్పపీడనంగా మారింది. చెన్నైలో దాదాపు 200 చెట్లు నేలకూలాయి. భారీ వర్షం కారణంగా నగరంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. అయితే అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోవడంతో పెద్ద నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. చెంగల్‌పట్టు జిల్లాలోని ఈస్ట్‌కోస్ట్‌ రోడ్‌, జీఎస్టీ రోడ్డులో చెట్లు నేలకూలాయి. రెండు జిల్లాలో ప్రజలు కరెంటు కోతలను ఎదుర్కొంటున్నారు.

ప్రతికూల వాతావరణం కారణంగా చెన్నై విమానాశ్రయంలో 13 దేశీయ, మూడు అంతర్జాతీయ విమానాలు రద్దు చేశారు. ప్రయాణికులు మరిన్ని అప్‌డేట్‌ల కోసం సంబంధిత విమానయాన సంస్థ(ల)ని సంప్రదించవలసిందిగా అభ్యర్థించాలని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం ట్వీట్ చేసింది.

మూడు జిల్లాలు రెడ్ అలర్ట్‌: చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టులల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. చెన్నై సహా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు ఇప్పటికే మూతపడ్డాయి  .పది జిల్లాల్లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు, తమిళనాడు ప్రభుత్వం 5,000 కంటే ఎక్కువ సహాయ కేంద్రాలను ప్రారంభించింది. ఒక్క చెంగల్‌పట్టు జిల్లాలోనే 1,058 కుటుంబాలు 28 కేంద్రాలకు మారాయి.

Follow Us:
Download App:
  • android
  • ios