Asianet News TeluguAsianet News Telugu

చిరుగుటాకులా వణుకుతోన్న తమిళనాడు.. విమానాల రాకపోకల నిలిపివేత 

Cyclone Mandous effect | బంగాళాఖాతంలో ఏర్పడిన మండూస్‌ తుఫాను తీరం వైపు దూసుకోస్తోంది. ఈ తుఫాను వల్ల ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ లోని తీర ప్రాంతాల్లో తీవ్ర ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో తమిళనాడు రాజధాని నగరంలో కూడా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారణంగా డిసెంబర్ 9న చెన్నై విమానాశ్రయంలో పలు విమానాలను రద్దు చేసినట్లు చెన్నై ఎయిర్‌పోర్ట్ అథారిటీ తెలిపింది. అదే సమయంలో..కొన్ని విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు.

Cyclone Mandous Several flights cancelled at Chennai airport
Author
First Published Dec 9, 2022, 6:09 PM IST

Cyclone Mandous effect | బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్ తుపాను తమిళనాడును వణికిస్తోంది. తుపాను ప్రభావంతో రాజధాని చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో దీనిని దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖ కూడా హెచ్చరిక జారీ చేసింది. చెన్నై, విల్లుపురం, కడలూరు , కాంచీపురంలోని అన్ని పాఠశాలలు,కళాశాలలను మూసివేయాలని ఆదేశించారు.  అదే సమయంలో డిసెంబర్ 9న చెన్నై విమానాశ్రయంలో పలు విమానాలను రద్దు చేసినట్లు చెన్నై ఎయిర్‌పోర్ట్ అథారిటీ తెలిపింది. 

ఈ సమాచారాన్ని చెన్నై ఎయిర్‌పోర్ట్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పంచుకున్నారు. రద్దు చేసిన విమానాల జాబితాను ఎయిర్‌పోర్ట్ అథారిటీ షేర్ చేసింది. డిసెంబర్ 9 మరియు 10 తేదీల్లో భారీ వర్షాలు మరియు తుఫాను గురించి IMD యొక్క హెచ్చరికను అనుసరించి విమానాల రద్దు జరిగింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ షేర్ చేసిన జాబితాలో 13 రద్దు చేసినట్టు తెలిపింది. విపరీతమైన వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాలు ప్రభావితమైన దృష్ట్యా సంబంధిత విమానయాన సంస్థలతో తనిఖీ చేయాలని అధికారులు సాధారణ ప్రజలకు సూచించారు.  తదుపరి అప్‌డేట్‌ల కోసం ప్రయాణికులు సంబంధిత విమానయాన సంస్థను సంప్రదించాల్సిందిగా అభ్యర్థించారు.

మరికొద్ది గంటల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు 

ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం.. రాణిపేటై, వెల్లూరు, తిరుపత్తూరు, కృష్ణగిరి, ధర్మపురి, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, అరియలూర్, పెరంబలూరు, తిరుచిరాపల్లి, కరూర్, ఈరోడ్, సేలంలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే.. తమిళనాడులోని నమక్కల్, తిరుప్పూర్, కోయంబత్తూర్, నీలగిరి, దిండిగల్, తేని, మధురై, శివగంగై, విరుదునగర్ మరియు తెన్‌కాసి జిల్లాల్లో రాగల కొద్ది గంటల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో మాండస్ తుఫాను కారణంగా.. చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.  తమిళనాడు, పుదుచ్చేరిలోని ఉత్తర కోస్తా ప్రాంతాల్లోని కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు మోహరింపు

వాతావరణ శాఖ హెచ్చరిక తర్వాత తమిళనాడులోని 10 జిల్లాల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్‌, రాష్ట్ర భద్రతా దళానికి చెందిన 12 బృందాలను మోహరించారు. 'మండస్' తుఫాను దృష్ట్యా, చెన్నై, విల్లుపురం, కడలూరు, కాంచీపురం జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలను శుక్రవారం మూసివేయాలని నిర్ణయించారు. మండూస్ తుపాను ఇవాళ అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తుఫాను వల్ల ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ లోని తీర ప్రాంతాల్లో తీవ్ర ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో తమిళనాడు రాజధాని నగరంలో కూడా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. 

"చెన్నైలో మాండస్ తుఫాను పరిస్థితిని ఎదుర్కొనేందుకు NDRF సిద్ధంగా ఉంది. చెన్నై అడయార్ ఇంద్ర నగర్‌లోని NDRF బృందాన్ని సిద్ధంగా ఉంచారు. అక్కడ వారు కఠినమైన పరిస్థితి ఏర్పడినప్పుడు తరలించడానికి రెస్క్యూ మెటీరియల్‌లను ప్యాక్ చేసారు. రాష్ట్ర అధికారుల నుండి హెచ్చరికలు అందిన వెంటనే అవసరమైన ప్రదేశానికి తరలిస్తాం’’ అని సబ్-ఇన్‌స్పెక్టర్ NDRF సందీప్ కుమార్ తెలిపారు.

బోట్లు, హై వోల్టేజీ మోటార్లు, సక్కర్ మిషన్లు, కట్టర్ మెషీన్లు మొదలైన అనేక పరికరాలను సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉంచినట్లు NDRF అధికారులు తెలిపారు. మాండౌస్ తుపాను తీవ్ర రూపం దాల్చి మరింత తీవ్రతను పెంచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సన్నాహాలు జరిగాయి. అంతకుముందు తమిళనాడులోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. చెంగల్‌పట్టు, విల్లుపురం, కాంచీపురం జిల్లాలపై నిఘా ఉంచారు.

Follow Us:
Download App:
  • android
  • ios