పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన సూపర్ సైక్లోన్ ఫణి ఒడిషాలోని పూరీ సమీపంలో శుక్రవారం తీరాన్ని తాకింది. ఇది గంటకు 22 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఉదయం 11.30 ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

తీరం దాటిన తర్వాత ఫణి క్రమంగా బలహీనపడుతుందని అధికారులు వెల్లడించారు. అయితే 200 నుంచి 230 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఫణి తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు ఒడిషాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.