Porbandar: 'బిపర్జోయ్' తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారింది. పోరు బందర్ తీరం నుంచి 200-300 కిలోమీటర్ల దూరం ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందనీ, అయితే రానున్న ఐదు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నెల 15న గుజరాత్ తీరం తాకే అవకాశముందని సమాచారం.
Cyclone Biparjoy: 'బిపర్జోయ్ సైక్లోన్' తీవ్ర తుఫానుగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. తుఫాను శరవేగంగా విస్తరిస్తున్నట్లు వాతావరణ సంస్థలు తెలిపాయి. 'బిపర్జోయ్' తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారింది. పోరు బందర్ తీరం నుంచి 200-300 కిలోమీటర్ల దూరం ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందనీ, అయితే రానున్న ఐదు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నెల 15న గుజరాత్ తీరం తాకే అవకాశముందని సమాచారం.
బిపర్జోయ్' తుఫాను తాజా వివరాలు ఇలా ఉన్నాయి...
- బిపర్జోయ్ తుఫాను తీవ్ర తుఫానుగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను శరవేగంగా విస్తరిస్తున్నట్లు వాతావరణ సంస్థలు తెలిపాయి.
- జూన్ 15న బిపర్జోయ్ తుఫాన్ దాదాపు ఉత్తర దిశగా ప్రయాణించి సౌరాష్ట్ర, కచ్, దానిని ఆనుకుని ఉన్న పాకిస్తాన్ తీరాలను దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
- రాగల ఐదు రోజుల పాటు గుజరాత్ లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
- సౌరాష్ట్ర, కచ్ తీరాల్లో బుధవారం వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, గురువారం నుంచి గరిష్ఠంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది.
- అరేబియా సముద్ర తీరంలోని గుజరాత్ లోని వల్సాద్ లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం టిథాల్ బీచ్ ను అధిక అలలు, బలమైన గాలుల కారణంగా పర్యాటకులకు తాత్కాలికంగా మూసివేశారు.
- గుజరాత్, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ తీరంలోని సముద్రాల్లో చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ మత్స్యకారులకు సూచించింది.
- అరేబియా సముద్రంలో ఉష్ణమండల తుఫాను విరుచుకుపడుతున్నందున గత వారం రోజులుగా భారత కోస్ట్ గార్డ్ కు చెందిన అన్ని తీరప్రాంత సంస్థలు మత్స్యకారులతో క్రమం తప్పకుండా కమ్యూనిటీ సంప్రదింపులు జరుపుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
- రాష్ట్ర ప్రభుత్వాలు తుఫాను పరిస్థితులను నిశితంగా గమనించాలనీ, తమ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలనీ, దినికి అనుగుణంగా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది.
- అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం, రాబోయే ప్రతికూల వాతావరణ పరిస్థితుల గురించి నౌకలను అప్రమత్తం చేయడానికి ఓడరేవులు సంకేతాలను పంపాల్సి ఉంటుంది. సముద్ర కార్యకలాపాల భద్రతను నిర్ధారించడానికి, నౌకలు-వాటి సిబ్బందిని రక్షించడానికి ఈ చర్యలు ఉపయుక్తంగా ఉంటాయని తెలిపింది.
- సింధ్, బలూచిస్థాన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పాక్ ప్రభుత్వం సూచించింది. జూన్ 13 రాత్రి నుంచి సింధ్, మక్రాన్ తీరాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పాకిస్తాన్ వాతావరణ శాఖ (పీఎండీ) తెలిపింది.
- ఈ తుఫానుకు బంగ్లాదేశ్ బిపర్జోయ్ అని నామకరణం చేసింది. ఈ పేరుకు బెంగాలీ భాషలో విపత్తు అని అర్థం.
