బిపర్ జోయ్ తుఫాన్ ను ఎదుర్కొనేందుకు  సిద్దంగా  ఉన్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  చెప్పారు.  

న్యూఢిల్లీ: బిపర్ జోయ్ తుఫాన్ ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు.తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలకు చెందిన అధికారులతో కేంద్ర మంత్రి అమిత్ షా మంగళవారంనాడు సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత అమిత్ షా మీడియాతో మాట్లాడారు. 

గుజరాత్, మహారాష్ట్రలకు ఎన్‌డీఆర్ఎఫ్ బలగాలను పంపినట్టుగా కేంద్ర మంత్రి చెప్పారు. గుజరాత్, ముంబైలలోని తీర ప్రాంతాల్లో ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎప్ బలగాలు సిద్దంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే రెండువేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా అమిత్ షా చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలోని తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. 12 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు. 

 దక్షిణ కర్ణాటక, మహారాష్ట్రలోని థానే జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ ప్రకటించిందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ నెల 15న బిసర్ జోయ్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ తుఫాన్ ను దృష్టిలో ఉంచుకొని 67 రైళ్లను పశ్చిమ రైల్వే శాఖ రద్దు చేసింది. గుజరాత్ లోని సౌరాష్ట్ర,కచ్ తీరానికి ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.