భుర్కపాల్ అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సిఆర్ఫిఎఫ్ బృందాలపై ఐఈడీ బ్లాస్ట్ లతో విరుచుకుపడ్డారు మావోయిస్టులు.
చత్తీస్‌గడ్: సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మరోసారి తమ ఉనికిని చాటుకున్నారు. భుర్కపాల్ అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సిఆర్ఫిఎఫ్ బృందాలపై ఐఈడీ బ్లాస్ట్ లతో విరుచుకుపడ్డారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ దాడిలో ఎనిమిది మంది సిఆర్పిఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఓ సీఆర్పీఎఫ్ అధికారి మృతి చెందారు.
మావోయిస్ట్ దాడిపై బస్తర్ ఐజీ సురేందర్ మాట్లాడుతూ... గాయపడిన జవాన్లందరిని మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక విమానంలో రాయ్ పూర్ కు తరలించామన్నారు. అయితే దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ ఓ అసిస్టెంట్ కమాండర్ మృతిచెందినట్లు తెలిపారు. మిగతా ఏడుగురు చికిత్స పొందుతున్నారని... వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు ఐజీ.
ఇటీవలే ఒరిస్సాలోని మల్కన్‌గిరి జిల్లా అడవుల్లో మావోయిస్టులు, గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. బలగాల కాల్పుల్లో ఓ మావోయిస్ట్ మృతిచెందగా మరొకరు తీవ్ర గాయాలతో పోలీసులకు చిక్కాడు. మావోల నుండి ఏకే 47 గన్ తో పాటు మరికొన్ని మారణాయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను గ్రేహౌండ్స్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Nov 29, 2020, 8:57 AM IST