ఢిల్లీలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ హోటల్ గదిలో భార్య చేయిని భర్త నరికేశాడు. వీరిద్దరిదీ . ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్ కాగా.. నిందితుడు సీఆర్పీఎఫ్ ఉద్యోగి. భార్య ప్రమోషన్ కోసం పరీక్ష రాసేందుకు వచ్చిన సమయంలో భర్త ఈ ఘోరానికి ఒడిగట్టాడు.
అతడో సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఆ భార్య కూడా ప్రభ్వుత్వ ఉద్యోగిణి. కానీ ఆమె ఉద్యోగం చేయడం భర్తకు ఇష్టం లేదు. అయినా ఆమె రోజూ విధులకు వెళ్తోంది. ప్రమోషన్ కోసం పరీక్ష రాసేందుకు కూడా సిద్ధమైంది. పరీక్ష రాసేందుకు వేరే ప్రాంతానికి వెళ్లి హోటల్ గదిలో ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన భర్త ఆమె అర చేయి నరికేసి పారిపోయాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్ 32 ఏళ్ల సతీష్ కుమార్ కుష్వాహా సీఆర్పీపీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి 28 ఏళ్ల భార్య ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నారు. భార్య ఉద్యోగం చేయడం సతీష్ కుమార్ కు ఇష్టం లేదు. అయినా ఆమె ప్రతీ రోజు విధులకు వెళ్తోంది. ఈ క్రమంలో ఆమె ప్రమోషన్ కు అర్హత పొందేందుకు పరీక్ష రాయాలని ఢిల్లీకి శుక్రవారం మధ్యాహ్నం భర్తతో కలిసి వచ్చింది.
ఆదర్శ్ నగర్ లోని ఓ చిన్న హోటల్ లో వీరిద్దరు గది అద్దెకు తీసుకున్నారు. అయితే వారి మధ్య ఉద్యోగం విషయం గొడవ జరిగింది. కొంత సమయం తరువాత సద్దుమణిగింది. హోటల్ సిబ్బంది ద్వారా ఈ జంట భోజనం తెప్పించుకున్నాడు. అయితే భార్యకు తెలియకుండా సతీష్ అందులో మత్తు మందు కలిపాడు. అది తిన్న తరువాత ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను మంచానికి కట్టేసి, దారుణంగా అరచేయి నరికాడు.
అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ నొప్పితో ఆమె స్పృహలోకి వచ్చింది. లేచి చూసి తన పరిస్థితి అర్థం చేసుకుంది. గట్టిగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి, బాధితురాలిని సఫ్దర్జంగ్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడి డాక్టర్లు గంటల తరబడి ఆపరేషన్ చేసి, ఆమె చేతిని తిరిగి అతికించారు.
ఈ ఘటపై ఐపీసీ సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేశామని, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (నార్త్ వెస్ట్) జితేంద్ర కుమార్ మీనా తెలిపారు. కాగా.. నిందితుడు గతంలో కూడా ఉత్తరప్రదేశ్ లోని ఓ మహిళపై దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆ దాడి విషయంలో అతడితో పాటు సోదరుడిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైందని పోలీసులు తెలిపారు.
