ఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ జవాను తన భార్యాపిల్లలను హత్య చేశాడు. అలహాబాద్ సీఆర్పీఎఫ్ క్యాంపులో నివాసం ఉంటున్న వీకే యాదవ్ అనే జవాను అక్కడ డ్రైవరుగా విధులు నిర్వహిస్తున్నాడు. 

ఆ క్రమంలో శనివారం ఉదయం తన భార్యతో పాటు కూతురు, కుమారులను తుపాకీతో కాల్చి చంపాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, పారా మిలిటరీ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వారిని ఎందుకు చంపాడనే విషయం తెలియరాలేదు. హత్యలు చేసిన తర్వాత ఇంటికి వెళ్లి గడియ పెట్టుకున్నాడని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని చెప్పారు.