Asianet News TeluguAsianet News Telugu

సుకుమా జిల్లాలో జవాన్ కాల్పులు: ముగ్గురు జవాన్ల మృతి, నలుగురికి గాయాలు

ఛత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ సీఆర్పీఎఫ్ జవాన్ తన తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మరణించారు., మరో నలుగురు గాయపడ్డారు.:

CRPF jawan fires at collegues in Sukma district of Cchattisgarrh, three dead
Author
Sukma, First Published Nov 8, 2021, 7:39 AM IST

సుకుమా:  ఛ్తతీస్ గఢ్ లోని సుకుమా జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కాల్పుల కలకలం చెలరేగింది. ఓ జవాన్ తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. గాయపడినవారిని భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

సుకుమా జిల్లాలోనని మారాయిగూడెం లింగంపల్లి బేస్ క్యాంప్ లోని 50వ సీఆర్ప్ఎఫ్ బెటాలియన్ లో ఈ సంఘటన జరిగింది. జవాన్ నుంచి అధికారులు తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్యాంప్ లో వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారున్నారు. నక్సలైట్ల వేటలో తీరిక లేకుండా పనిచేస్తూ, సెలవులు కూడా లేకపోవడంతో జవాన్ మానసిక అశాంతికి గురైనట్లు చెబుతున్నారు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. 

సెలవుల విషయంలో జవాన్ల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఇరు పక్షాలు కాల్పులకు దిగినట్లు సమాచారం. ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

వివరాలు అందాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios