ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్.. తన తోటి జవాన్లపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో.. ఆ ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన జమ్మూకశ్మీర్ లో చోటుచేసుకుంది. తోటి జవాన్లపై కాల్పులు అనంతరం ఆ కానిస్టేబుల్ తనను తాను కాల్చుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాగా.. గమనించిన ఉన్నతాధికారులు అతనిని ఆస్పత్రికి తరలించారు.

కాగా.. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ఈ ఘటన జమ్మూకశ్మీర్‌ ఉద్దంపూర్‌లోని 187వ బెటాలియన్‌ క్యాంపులో జరిగింది. అక్కడ పనిచేస్తున్న అజిత్ కుమార్‌ అనే సీఆర్పీఎఫ్‌ జవాన్‌‌తో తోటి సహచరులు గొడవకు దిగారు. దీంతో సహనం కోల్పోయిన అతడు వారిపై కాల్పులు జరిపినట్లు సమాచారం. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.