46 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా వైరస్: ఒకరి మృతి
దేశ రాజదాని ఢిల్లీలోని ,సీఆర్పీఎఫ్ బెటాలియన్ లోని 46 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. కరోనా వైరస్ వ్యాధితో మంగళవారంనాడు ఓ జవాను మరణించాడు. వేయి మందిని క్వారంటైన్ కు తరలించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని సీఆర్ఫీఎఫ్ బెటాలియన్ లో 46 మందికి కరోనా వైరస్ సోకింది. కాగా, ఒక జవాను కోవిడ్ -19తో మంగళవారంనాడు మరణించాడు. బెటాలియన్ లోని దాదాపు వేయి మందిని క్వారంటైన్ కు తరలించారు.
గత రెండు రోజులుగా తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ లో గల 31వ సీఆర్పీఎఫ్ బెటాలియన్ లో అకస్మాత్తుగా కరోనా వైరస్ విజృంభించింది. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన జవాన్లకు ఢిల్లీలోి మండవాలిలో చికిత్స అందిస్తున్నారు. 55 ఏళ్ల జవాను మంగళవారంనాడు సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో మరణిించాడు.
సిఆర్పీఎఫ్ జవానుకు ఈ నెల ప్రారంభంలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. బెటాలియన్ లో చేరిన ఆ జవానుకు 17వ తేదీన ఆ లక్షణాలు కనిపించగా, 21వ తేదీన అతనికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అతన్ని రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో చేర్చారు.
ఏప్రిల్ 24వ తేదీన బెటాలియన్ లోని తొమ్మిది సిఆర్పీఎఫ్ అధికారులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ మర్నాడు 15 మందికి పాజిటివ్ వచ్చింది.