హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి తప్పిన ముప్పు.. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి ముప్పు తప్పింది. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్‌ను కాదని బీజేపీ అభ్యర్థికి ఓటేసిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ వేటు వేశారు. ఈ ఆరుగురిపై అనర్హత వేటు వేశారు.
Himachal Pradesh: రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు క్రాస్ వోటింగ్ చేశారు. బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి రాజ్యసభ సభ్యుడిగా గెలిపించారు. అంతేకాదు, త్వరలోనే అవిశ్వాస పరీక్ష పెడతామని, తద్వార కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగుతుందనే వాదనలను బీజేపీ వర్గాలు చేశాయి. అయితే.. ఈ ముప్పు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకుంది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో ద్వారా అవిశ్వాస తీర్మాన సవాల్ నుంచి బయటపడింది.
క్రాస్ ఓటింగ్ వేసిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిన్న అసెంబ్లీలోకి ప్రవేశిస్తుండగా బీజేపీ నాయకులు చప్పట్లు కొట్టారు. అంతకు ముందటి రాత్రి వరకు ఆ ఎమ్మెల్యేలు బీజేపీ పాలిత హర్యానాలో ఉన్న సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజిందర్ రాణా, సుధీర్ శర్మ, ఇందర్ దత్తా లఖాన్‌పల్, దేవిందర్ కుమార్ భుతూ, రవి ఠాకూర్, చేతన్య శర్మలపై అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా ఈ రోజు అనర్హత వేటు వేశారు. అసెంబ్లీలో నిన్న ద్రవ్య బిల్లు ప్రవేశపెట్టగా.. ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలన్న విప్‌ను ఆ ఎమ్మెల్యేలు ఉల్లంఘించారని స్పీకర్ పేర్కొన్నారు. 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను పాస్ చేసుకుంది.
ఆ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని ఉల్లంఘించారని స్పీకర్ వివరించారు. వీరిని సస్పెండ్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ముప్ుప తప్పింది.