ఆవు ఫుట్ బాల్ ఆడటం ఎప్పుడైనా చూశారా? ఆవు ఎక్కడైనా ఫుట్ బాల్ ఆడుతుందా అని ఎదురు ప్రశ్న వేయకండి. గోవాలో ఒక ఆవు నిజంగానే ఫుట్ బాల్ ఆడింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. గోవాలోని మార్డోల్ ప్రాంతంలో కొందరు యువకులు ఫుట్ బాల్ ఆడుతున్నారు. అంతలో బాల్ వెళ్లి అక్కడే ఉన్న ఓ ఆవు కాలు మధ్యలో ఇరుక్కుపోయింది. దానిని తీసుకుందామని ఓ యువకుడు ప్రయత్నించగా.. అది కొమ్ములతో పొడవబోయింది. అక్కడితో ఆగిందా.... ఆ బంతిని అచ్చం మనిషి ఆడినట్టే ఆడింది. 

ఓ యువకుడు డేర్ చేసి దాని దగ్గర నుంచి బంతిని తీసుకున్నాడు. అయినా ఆ ఆవు బంతిని వదలలేదు. బంతి ఎటువెళ్లే అటూ ఆ ఆవు అచ్చం ఫుట్ బాల్ ప్లేయర్ లాగా పరుగులు తీసింది. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది. కొన్ని లక్షల మంది ఈ వీడియోని వీక్షించారట. ఆ ఆవును ఫుట్ బాల్ దిగ్గజాలు రోనాల్డ్, మెస్సీలతో పోలుస్తూ కామెంట్స్ పెట్డడం విశేషం. భారత ఫుట్ బాల్ జట్టులో దీన్నిచేర్చుకుంటే ఇక ఆట మనదేనంటూ సరదాగా సూచిస్తున్నారు. మరికొంత మంది ఫిఫాకు కూడా దీని గురించి తెలిసేలా ట్యాగ్ చేస్తున్నారు.