హైదరాబాద్: సీపిఎం నేత సీతారాం ఏచూరి నివాసంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనా వైరస్ కారణంగా మరణించాడు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

ఆశిష్ ఏచూరి గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తన కుమారుడికి చికిత్స అందిస్తూ ఆశను రేకెత్తించిన వైద్యులకు, నర్సులకు, ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లకు, శానిటేషన్ వర్కర్లకు, తమ పక్కన నిలబడిన ఇతరులకు సీతారాం ఏచూరి ధన్యవాదాలు తెలిపారు. 

సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి ఓ పత్రికలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. గురుగ్రావ్ లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. రెండు వారాల క్రితం ఆయనకు కరోనా వైరస్ సోకింది.

 

సీతారాం ఏచూరి సీపీఎం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీతారాం ఏచూరి సిపిఎంలో అగ్రస్థానానికి ఎదిగారు.