భారత్ జోడో యాత్రకు తమ పార్టీ వ్యతిరేకం కాదని సీపీఎం కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ తెలిపారు. ప్రజాస్వామ్యబద్దంగా ఏ యాత్ర చేపట్టిన తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
భారత్ జోడో యాత్ర కేరళ రాష్ట్రంలో ప్లాన్ కంటే ఎక్కువ రోజులు కొనసాగాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో కాంగ్రెస్, సీపీఎం మధ్య ట్వీట్ ల వార్ కొనసాగింది. ఒక రోజు తరువాత మరో పరిణామం చోటు చేసుకుంది. కేరళలో అధికార పార్టీగా ఉన్న సీపీఎం.. యాత్రపై రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకుండా మరింత జాగ్రత్తగా వ్యవహరించే విధానాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. రాహుల్ గాంధీ పాదయాత్ర వెనుక ఉన్న స్పష్టమైన రాజకీయాన్ని గ్రహించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్.. తమ పార్టీ యాత్రకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం.. ఇంట్లో తెలియడంతో పారిపోయి, చెట్టుకు ఉరేసుకుని...
ఈ కొత్తగా ఎన్నికైన సీపీఎం కేరళ చీఫ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ చేపట్టిన యాత్రకు లేదా మరే ఇతర ప్రజాస్వామిక ప్రక్రియకు సీపీఎం వ్యతిరేకం కాదని అన్నారు. అయితే పార్టీపైనా, లెఫ్ట్ ఫ్రంట్‌పైనా లేదా రాష్ట్ర ప్రభుత్వంపైనా అన్యాయమైన విమర్శలు వస్తే దానికి అనుగుణంగా పార్టీ స్పందిస్తుందని గోవిందన్ చెప్పారు. పాన్-ఇండియా టూర్‌ను “కంటైనర్ యాత్ర” అని పిలిచిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం స్వరాజ్ వ్యాఖ్యలను గోవిందన్ ఆమోదించలేదు.
కాగా.. పార్టీ సభ్యులు ఒకరిని ఒకరు రెచ్చగొట్టకోకుండా, ఆకస్మికంగా దూషించుకోవడంపై సీపీఎం, కాంగ్రెస్ రెండు పార్టీల నాయకులు ఆశ్చర్యపోయారని వర్గాలు తెలిపాయి. ‘జైరామ్ రమేష్ లాంటి నాయకుడు కేరళ, సీపీఎంపై ఇలాంటి ట్వీట్ చేస్తారని మేము ఎప్పుడూ అనుకోలేదు. అందుకే కాస్త ఆశ్చర్యంగా ఉంది’’ అని సీపీఎం సీనియర్ నేత ఒకరు తెలిపారని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నివేదించింది. మరోవైపు రాహుల్ వ్యంగ్య చిత్రంతో ఉన్న సీపీఎం ట్వీట్‌ను నివారించవచ్చని కాంగ్రెస్ కూడా భావించింది. “సీతారాం ఏచూరి జ్ఞానంతో ఇది జరిగిందని మేము భావించడం లేదు. వాస్తవానికి, జాతీయ వామపక్ష నాయకులు అలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని కోరుకున్నారు” అని ఓ నాయకుడు తెలిపారు.
దేవేంద్ర ఫడ్నవీస్ భార్యపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. మహిళ అరెస్టు
మరోవైపు కేరళ ముఖ్యమంత్రిపై జైరామ్ రమేష్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ సీపీఎం సీనియర్ నేత థామస్ ఐజాక్ కూడా ట్వీట్ చేశారు. “ డియర్ రమేష్ జీ, మీ స్పందన చూసి నేను ఆశ్చర్యపోయాను. కేరళ సీఎంను అకారణంగా అవమానించడం ఎందుకు? ఇది జోడో యాత్రకు శుభారంభం కాదు. ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. గుజరాత్, యూపీలను తప్పించుకుంటూ 18 రోజుల పాటు కేరళలో పర్యటించి ఎవరిని ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు? ఏది ఏమైనా హ్యాపీ జర్నీ’’ అని ఐజాక్ ట్వీట్ చేశారు.
ఎస్సై పోస్టుకు రూ. 30 లక్షలు.. స్కాం బట్టబయలు చేసిన సీబీఐ
ఇదిలా ఉండగా.. భారత్ జోడో యాత్ర కేరళలో మూడో రోజు కలంబళంలో ముగిసింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు చేశారు. బీజేపీ విద్వేషం వ్యాపింపజేయడం వల్లే భయాందోళనకు గురవుతోందని అన్నారు. హిందుత్వాన్ని నమ్మే పార్టీ సమాజంలో అశాంతిని సృష్టిస్తోందని ఆరోపించారు. కాగా.. అంతకు ముందు అట్టింగల్‌లో కె రైలు వ్యతిరేక ఉద్యమ నాయకులతో రాహుల్ చర్చలు జరిపారు, వారి నిరసనకు రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపారు. కాగా.. ఈ యాత్ర నేడు (బుధవారం) మధ్యాహ్నం కొల్లాం జిల్లాలోకి యాత్ర ప్రవేశించనుంది.
