Asianet News TeluguAsianet News Telugu

నందిగ్రామ్‌ : మమతపై పోటీగా మహిళా అభ్యర్ధి.. కాంగ్రెస్- కూటమి నిర్ణయం

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజకీయాలన్నీ నందిగ్రామ్ నియోజకవర్గం చుట్టూనే తిరుగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

CPM declares Minakshi Mukherjee as its candidate from Nandigram ksp
Author
Nandigram, First Published Mar 10, 2021, 9:22 PM IST

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజకీయాలన్నీ నందిగ్రామ్ నియోజకవర్గం చుట్టూనే తిరుగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

ఆమె ప్రత్యర్థి, బీజేపీ నేత సుబేందు అధికారి సైతం నందిగ్రామ్ నుంచే బరిలోకి దిగుతున్నారు. దీంతో అందరి దృష్టీ నందిగ్రామ్‌పై పడింది. అయితే సీపీఎం, కాంగ్రెస్ కూడా ఓ మహిళా అభ్యర్థినే ఎంపిక చేసింది.

మీనాక్షి ముఖర్జీని నందిగ్రామ్ అభ్యర్థిగా బరిలోకి దించాయి. సాక్షాత్తూ సీఎం మమతా బెనర్జీ కావడంతో సీపీఎం, కాంగ్రెస్ కూటమి కూడా మహిళను బరిలోకి దింపింది. మీనాక్షి ముఖర్జీ డీఐఎఫ్ఐ నాయకురాలిగా ఉన్నారు.

Also Read:బెంగాల్ ఎన్నికలు: నందిగ్రామ్‌‌లో మమతా బెనర్జీపై దాడి, సీఎంకు గాయాలు

అయితే తొలుత అబ్బాస్ సిద్ధిఖీని నందిగ్రామ్ నుంచి బరిలోకి దించాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఆయన విముఖత చూపడంతో కాంగ్రెస్, వామపక్షాలు మీనాక్షిని రంగంలోకి దించాయి. 

2016 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున సువేందు అధికారి గెలుపొందారు. అంతకుముందు కూడా ఈ స్థానం టీఎంసీ చేతిలోనే ఉంది. అయితే గత ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి బరిలో దిగిన సువేందు అధికారి.. ఈ సారి బీజేపీలో చేరారు.

సీఎం మమతా బెనర్జీ సైతం ఎంతోకాలంగా పోటీ చేస్తూ వస్తున్న భవానీపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం కాదని నందిగ్రామ్‌ నుంచి బరిలోకి దిగుతుండడం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios