Asianet News TeluguAsianet News Telugu

రాజకీయాల్లో నేరచరితుల అంతు చూడాలని సీజేఐ వున్నారు.. అందుకే రాష్ట్రపతితో భేటీ: సీపీఐ నారాయణ

తమ అభ్యర్థుల క్రిమినల్ రికార్డులను బయటపెట్టడం రాజకీయ నాయకులకు ఇష్టం లేదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ  అన్నారు. రాష్ట్రపతిని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కలవడం శుభపరిణామమని నారాయణ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ లో ఉన్న 33 మందికి నేర చరిత్ర ఉందని ఆయన ఆరోపించారు

cpi narayana interesting comments on cji justice nv ramana meets president ram nath kovind
Author
new delhi, First Published Aug 12, 2021, 9:52 PM IST

నేర చరిత్ర కలిగిన నేతలపై లోతైన విచారణ జరపాలనే పట్టుదలతో జస్టిస్ ఎన్వీ రమణ ఉన్నారని అన్నారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ. ఈ విచారణ కేంద్రం, రాష్ట్రాల్లోని నేతలకు ఇష్టం లేదని.. అందుకే మద్దతు కోసం రాష్ట్రపతిని సీజేఐ కలిశారని నారాయణ వ్యాఖ్యానించారు. తమ అభ్యర్థుల క్రిమినల్ రికార్డులను బయటపెట్టడం రాజకీయ నాయకులకు ఇష్టం లేదని అన్నారు. రాష్ట్రపతిని చీఫ్ జస్టిస్ కలవడం శుభపరిణామమని నారాయణ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ లో ఉన్న 33 మందికి నేర చరిత్ర ఉందని ఆయన ఆరోపించారు.

ఇదిలావుంచితే, ముఖ్యమంత్రి జగన్ తన ఎంపీలతో కలిసి ధర్నాకు దిగితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుందని నారాయణ అభిప్రాయపడ్డారు. కానీ ఆ పని జగన్ చేయలేరని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య వ్వవస్థలో అత్యంత పవిత్రమైన పార్లమెంటులో హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్చింది కన్నీళ్లు కాదని, అది రైతుల రక్తమని విమర్శించారు. రైతుల సమస్యలు, చావులపై చర్చించే అవకాశాన్ని కూడా ఆయన ఇవ్వలేదని నారాయణ అన్నారు.

ALso Read:బీజేపీ, కాంగ్రెస్ సహా 9 పార్టీలపై జరిమానా విధించిన సుప్రీం

కాగా, రాజకీయ నాయకుల క్రిమినల్ రికార్డులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒక అభ్యర్థిని ఎంపిక చేసిన 48 గంటల్లోగానే ఆ వ్యక్తి క్రిమినల్ రికార్డును ఆయా పార్టీలు బయటపెట్టాలని ఆదేశించింది. ఇదే సమయంలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కలిశారు. ఈ భేటీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios