న్యూఢిల్లీ: సీపీఐ నేత. మాజీ ఎంపీ గురుదాస్ గుప్తా గురువారం నాడు ఉదయం కన్నుమూశారు. గుండె, కిడ్నీల సమస్యలతో ఆయన కొంత కాలంగా బాధపడుతున్నారు.

అనారోగ్యంతో  గురుదాస్ గుప్తా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం  నాడు ఉదయం కన్నుమూశారు. గురుదాస్ గుప్తా వయస్సు 83 ఏళ్లు. గురుదాస్ గుప్తా వయస్సు 83 ఏళ్లు. 

గురుదాస్ గుప్తా సీపీఐ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా కూడ  కొంత కాలంగా పనిచేశాడు. 2001లో గురుదాస్ గుప్తా ఎఐటీయూసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేవారు. కార్మికుల  హక్కుల కోసం ఆయన పలు పోరాటాలకు నాయకత్వం వహించారు.

2004లో సీపీఐ జాతీయ సెక్రటేరియట్  సభ్యుడిగా ఎన్నికయ్యారు. గురుదాస్ గుప్తా  పలు  కేసుల్లో జైలుకు కూడ వెళ్లారు. కార్మికుల పక్షపాతిగా గురుదాస్ గుప్తా పేరొందారు.

ఎంపీగా పార్లమెంట్‌లో పాలక పక్షాన్ని ఇరుకునపెట్టడంలో గురుదాస్ గుప్తా పేరొందారు.

ఎంపీగా పార్లమెంట్‌లో పాలక పక్షాన్ని ఇరుకునపెట్టడంలో గురుదాస్ గుప్తా పేరొందారు. లోక్‌సభలో తన ప్రసంగాలతో పాలకపక్షంతో పాటు  ప్రతిపక్ష సభ్యులను కూడ ఆలోచింపజేసేవారు. 

మూడు దఫాలు రాజ్యసభ సభ్యుడిగా, రెండు దఫాలు లోక్‌సభ సభ్యుడిగా గురుదాస్ గుప్తా ప్రాతినిథ్యం వహించారు.1985, 1988, 1994లలో గురుదాస్ గుప్తా రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత రెండు దఫాలు గురుదాస్ గుప్తా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

బెంగాల్ రాష్ట్రంలో వామపక్ష సంఘటన ప్రభుత్వంలో పలు కార్మిక చట్టాలు తీసుకురావడంలో గురుదాస్ గుప్తా కీలక పాత్ర పోషించారు. బెంగాల్ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా ఎఐటీయూసీ ఆధ్వర్యంలో పలు కార్మిక పోరాటాలకు గురుదాస్ గుప్తా నాయకత్వం వహించారు.

బెంగాల్  రాష్ట్రానికి చెందిన పాత తరం కమ్యూనిష్టు నేతలు ఒక్కొక్కరుగా మృతి చెందుతున్నారు. బెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసు మృతి చెందారు.మాజీ లోక్ సభ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ గత ఏడాది కన్నుమూశారు. లోక్‌సభ స్పీకర్ గా చటర్జీ చేపట్టిన అనేక కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి.